Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రతిరోజూ అరగంట పాటు ఇలా చేస్తే మీ ఆయుష్షు 9 సంవత్సరాలు పెరుగుతుంది!
సాధారణంగా జీవించే దానికంటే ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ కాలం జీవించాలనే కోరిక ఉంటుందో వారు తమ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు మాత్రమే కేటాయిస్తే, అది మీ ఆయుష్షుకు సగటున 9 సంవత్సరాలు పెంచగలదు. 2017లో బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక ప్రముఖ అధ్యయనంలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. అయితే మనిషి తన ఆయుష్షు పెంచుకోవడానికి ఏం చేయాలి? ఆ అధ్యయనంలో ఏం వెల్లడైంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోజూ కేవలం అరగంట జాగింగ్ చేయడం!
చాలా మంది తమకు 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ చిన్న పిల్లాడి మాదిరిగానే కనిపిస్తుంటారు. 40 సంవత్సరాలలోనూ 30 సంవత్సరాల వ్యక్తిలా కనిపిస్తారు. వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అయితే ఇది ఉన్నట్టుండి వచ్చిన మార్పు అయితే కాదు. ఇది వారి ఈ అద్భుతమైన మార్పు వారి ప్రతి రోజు చేసే శారీరక వ్యాయామం వల్లే సాధ్యమైంది. వయసు పెరుగుతున్నప్పటికీ శారీరక శ్రమ చేస్తే మన శరీరంలో శక్తి, ఆరోగ్యం పెరుగుతాయి, ఇలా వ్యాయామం చేసే వారు ఎక్కువకాలం జీవించగలుగుతారని అధ్యయనంలో వెల్లడైంది.

ఎందుకు పెరుగుతుంది?
శారీరక శ్రమ చేయడం వల్ల మన శరీరంలోని క్రోమోజోముల్లోని టెలోమియర్లు పొడవుగా పెరుగుతాయి. ఇవి మన జీవ గడియారం మాదిరిగా పనిచేస్తాయి. మన వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ టెలోమియర్లు క్రమంగా చిన్నవవుతాయి, కానీ శారీరకంగా చురుకుగా ఉండే వారు ఈ టెలోమియర్ల పొడవు పెంచుకుంటారు. టెలోమియర్లు పొడవుగా ఉన్నప్పుడు, వృద్ధాప్య ప్రభావాలు తగ్గిపోతాయి. ఇది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఈ టెలోమియర్లు సంకోచిస్తే, ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. కణాల వయస్సు తగ్గిపోతుంది. శరీరంలో డిఎన్ఏ నష్టం జరగవచ్చు, మరియు శరీర కణాలు కూడా బలహీనమవుతాయి. దీంతో చర్మం ముడతలు పడటం, జుట్టు నెరిసిపోవడం, అవయవాల పనితీరు మందగించడం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా ప్రత్యక్షమవుతాయి.
వ్యాయామం ఎంత సమయం చేయాలి?
ఇదంతా చదివాకా అసలు ఎంత సమయం వ్యాయామం చేయాలి? వ్యాయామానికి ఎంత సమయం కేటాయించాలనే అపోహ మీలో కలిగే ఉంటుంది. అయితే
మహిళలు: వారానికి ఐదు రోజులు, ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల జాగింగ్ చేయడం చాలా మంచిది.
పురుషులు: వారు 40 నిమిషాల పాటు జాగింగ్ చేయడం మంచిది.
జాగింగ్ మాత్రమే కాకుండా, మీరు ఇంట్లో చేసే పనులు కూడా వ్యాయామం లాంటివి. ఆ పనులను చేసేటప్పుడు మీరు మీ చేతులు, కాళ్ళను శ్రమ పెట్టడం వలన శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. ఇంట్లోనే సాధారణంగా చేసే పనులు కూడా శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు సహాయపడతాయి.
మంచి జీవనశైలికి అవసరమైన అలవాట్లు
అంతే కాదు, కొన్ని దినచర్యలు కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచుతాయి. మంచి ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం, మానసిక ఒత్తిడి తగ్గించడానికి యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేయడం కూడా మీ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. వ్యాయామం కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications