Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ 3 మూడు పానీయాలు తాగితే.. మీ బాడీ మొత్తం క్లీన్ అవుతుంది! మీ అంత ఫిట్ ఎవరూ ఉండరు
రోజురోజూకు కాలం పెరుగుతున్న కొద్దీ.. మనిషి తన ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టె తీరు కూడా మారుతుంది. కొంతకాలంగా చాలా మంది డీటాక్స్ పానీయాలపై ద్రుష్టి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి కూడా. ఆరోగ్య నిపుణులు కూడా వీటిని సిఫారసు చేస్తున్నారు. దీనివల్ల చర్మ సమస్యలు తగ్గిపోవడంతో పాటు, శరీరం శుభ్రం అవుతుందని, జీర్ణ క్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. శరీరంలో కొవ్వు కూడా తొలగిపోవడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి డీటాక్స్ పానీయాలు తాగాలి? వాటిని తాగితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దోసకాయ-పుదీనా డీటాక్స్ వాటర్:
ఒక కప్ నీటిలో దోసకాయ ముక్కలు మరియు 5-6 పుదీనా ఆకులు వేసి, రాత్రి ఫ్రిజ్‌లో ఉంచండి. ఉదయం ఆ నీటిని తాగితే, శరీరం శక్తివంతంగా మారుతుంది. ఈ పానీయం చర్మం కోసం ఎంతో మంచిదని చెప్పవచ్చు. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, మెరిసేలా చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ డీటాక్స్ వాటర్:
ఒక గ్లాస్ నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలపండి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. తద్వారా ఆకలి తగ్గి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి శుభ్రత మరియు ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
గ్రీన్ టీ, నిమ్మకాయ డీటాక్స్ వాటర్:
గ్రీన్ టీ, నిమ్మకాయ డీటాక్స్ బరువు తగ్గడంలో సహాయం చేయడమే కాక, వృద్ధాప్యాన్ని కూడా మందలిస్తుంది. ఒక టీస్పూన్ గ్రీన్ టీ, నిమ్మరసం కలిపి తాగితే శరీరానికి ఉత్తమమైన పోషకాలు అందుతాయి. వేసవిలో ఐస్ జోడించవచ్చు, ఇది తాజాదనాన్ని అందజేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ C, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ డీటాక్స్ పానీయాలు చర్మానికి మరియు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. మరింత శక్తివంతమైన శరీరాన్ని పొందడానికి, అవి అద్భుతమైన సహాయకారిగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications