Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీరు నడుస్తున్నప్పుడు ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీకు కచ్చితంగా షుగర్ ఉన్నట్లే!
మనిషి జీవన విధానంతో పాటు వారు తింటున్న ఆహార శైలి కూడా పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ఎలాంటి ఆహరం తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తున్నారు. దీంతో పాటు ఎలాంటి వ్యాయామం చేయకపోవడం.. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వంటి పనుల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది అధికంగా ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది షుగర్. యుక్త వయసులో ఉన్న వ్యక్తులు కూడా ఈ డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
డయాబెటిస్ అనేది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ యొక్క అసమతుల్యత వల్ల ఏర్పడే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిని నివారించుకునేందుకు ప్రత్యేకమైన చికిత్సలు మార్కెట్‌లో ఏవీ లేవు. కానీ మందుల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. ప్రాథమికంగా ఈ వ్యాధి శరీరాన్ని సున్నితంగా ప్రభావితం చేయడం మొదలుపెడుతుంది. మొదటి దశలో దీని లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. కానీ ప్రారంభ దశలోనే కొన్ని సూచనలను గమనిస్తే, వ్యాధి మరింత ముదరకముందే దానిని నియంత్రిచుకోవచ్చు. అలాగే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని కొనసాగించొచ్చు. అయితే ఈ స్టోరీలో డయాబెటిస్ వస్తుండడనడానికి ఎలాంటి సంకేతాలు వస్తాయి? ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం.

నడకలో సమస్యలు
డయాబెటిస్ వస్తుందనడానికి ముందు నడకలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తుంటాయి. ఆ మార్పులను గుర్తించగలిగితే డయాబెటిస్ వ్యాధిని మీరు సులభంగా వ్యాధి ప్రారంభదశలోనే నియంత్రించుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటంటే?
బలహీనత మరియు అలసట: డయాబెటిస్ ఉన్నవారిలో బలహీనత మరియు అలసట అనేది సాధారణ లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల, శరీర కణాలు గ్లూకోజ్‌ను అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోలేవు. అందువల్ల శరీరానికి అవసరమైన శక్తి అందదు. ఈ పరిస్థితి నడుస్తున్నప్పుడు మరింత బలహీనత మరియు అలసట కలిగిస్తుంది. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా నడుస్తున్నప్పుడు అలసటగా అనిపిస్తే ఈ వ్యాధి మీకు ప్రారంభదశలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
కాళ్లలో తిమ్మిరి: డయాబెటిస్ కారణంగా నరాల వ్యవస్థకు హానీ కలుగుతుంది. దీనికి "డయాబెటిక్ న్యూరోపతి" అని అంటారు. ఈ పరిస్థితిలో, పాదాలలో నొప్పి, తిమ్మిరి మరియు ఇతర అనారోగ్య సంకేతాలు కనిపించవచ్చు. నడుస్తున్నప్పుడు కాళ్లపై ఒత్తిడి రావడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారవచ్చు. ఒకవేళ మీ కళ్ళలో తిమ్మిరి వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి దానికి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
శ్వాస ఆడడంలో ఇబ్బంది: డయాబెటిక్ వ్యక్తులలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది కూడా ఒక సాధారణ సమస్య. శారీరక శ్రమ చేసేటప్పుడు, డయాబెటిస్ కారణంగా గుండె మరియు ఊపిరితిత్తులపై అదనపు ఒత్తిడి వస్తుంది, దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.
కాళ్ళలో వాపు: డయాబెటిస్ కారణంగా రక్తప్రసరణ అవ్యవస్థితంగా మారుతుంది, దీంతో పాదాలలో వాపు ఏర్పడుతుంది. పాదాలకు సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల, శరీరంలోని ద్రవం ఎక్కువగా పెరిగి కాళ్ళు వాచినట్టు కనిపించవచ్చు.
ఈ నాలుగు లక్షణాలు ఏదైనా కనిపించినా, మీరు వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. డయాబెటిస్ ను సకాలంలో గుర్తించి, వ్యాధి ముదరకుండా అదుపులో ఉంచే విధంగా చికిత్స తీసుకుంటే, దీని ప్రభావాలను నియంత్రించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications