Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Best oil for hair problem: ఈ ఆయిల్ వాడితే బట్టతల మీద కూడా వెంట్రుకలు వచ్చేస్తాయ్!
ప్రస్తుతం బట్టతల అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారిపోయింది. పెద్ద వయస్సు వారికి బట్టతల వస్తే ఏమోలే అనుకుంటాం గానీ ప్రస్తుతం చిన్నవయస్సు వారికి కూడా బట్టతల వచ్చేస్తుండటం చాలా మందిని ఇబ్బందిపెడుతుంది. పెళ్లీడుకు వచ్చేసరికి చాలామంది మగవాళ్లకి బట్టతల వచ్చేస్తోంది. దీంతో నలుగురికిలోకి వెళ్లి నిలబడాలంటేనే కొందరు భయపడుతున్నారు. బట్టతల సమస్యను ఎదుర్కొనేందుకు కొందరైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సహా అనేక రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటుండగా..ఆహారపు అలవాట్లు,జీవనశైలి మార్చి మరికొందరు ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతుంటారు.
జుట్టు పోయే సమస్య మహిళల్లో కూడా కనిపిస్తుంది..కానీ పురుషులలో ఇది ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి బట్టతల అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉన్నప్పుడు..తదుపరి తరాలకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయనమాట.

బట్టతలమీద కూడా వెంట్రుకలు మొలుస్తాయంటూ కొందరు మార్కెట్ లోకి కొన్నిరకాల ఆయిల్స్ ని తీసుకొస్తున్నారు. అయితే వీటిని వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కొందరు చెప్తున్నారు. అసలు బట్టతల సమస్యకు పరిష్కారం మన ఇంట్లోనే ఉంటుది. రోజ్మేరీ,ఆముదంతో బట్టతల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలిపారు.
రోజ్మేరీ,ఆముదంతో బట్టతలకు సమస్యకు సొల్యూషన్
ప్రాచీన కాలం నుంచి జుట్టు సంరక్షణలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న రెండు ఆయిల్స్.. ఆముదం నూనె, రోజ్మేరీ ఆయిల్. ఈ రెండు కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఆముదం నూనె - రోజ్మేరీ ఆయిల్ ను కలిపి తలపై ఆఫ్లై చేయడం వల్ల నెమ్మదిగా స్థిరమైన ఫలితాలను అందిస్తుంది. సహజ పదార్థాలు కావడం వల్ల ఇది ఏ దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తుంది.
వీటి ప్రత్యేకత ఇదే
ఆముదం నూనె..జుట్టును బలపరుస్తుంది, తల చర్మం సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఇందులో రిసినోలిక్ యాసిడ్ అధికంగా ఉండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తల చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, జుట్టును బలంగా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఉపయోగించే విధానం
ఆముదం-రోజ్మేరీ ఆయిల్ ను 2:1 నిష్పత్తిలో కలిపి ఈ మిశ్రమాన్ని తల చర్మానికి మృదువుగా మర్దన చేయాలి. కనీసం 30 నిమిషాలు నుండి 1 గంట వరకు ఉంచి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలను శుభ్రపరచాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గిపోయి కొత్త జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. జుట్టు సహజంగా మెరిసిపోవడంతో పాటు ఆరోగ్యవంతంగా కూడా మారుతుంది. చర్మ సమస్యలు తొలగిపోతాయి.
Note: ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ వాడేముందు సంబంధిత నిపుణుల సూచనలు,సలహాలు తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications