Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
మీ కళ్ళు ఈ విధంగా మారితే,మీకు వందశాతం గుండెపోటు వస్తుంది.. వెంటనే చెక్ చేసుకోండి
మన శరీరంలో నరాలకు రక్తప్రసరణ సమన్వయంగా, సక్రమంగా జరగాలి. ఒకవేళ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె ఆగిపోతుంది. కాబట్టి రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధించడం అనేది చాలా ముఖ్యం. దీని కోసం మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు అనేది కేవలం ఒక్క క్షణంలోనే మనిషిని విగతజీవిగా మార్చేస్తుంది. అందుకే గుండెపోటు వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తిస్తే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
ఇప్పటికే చాలా మంది వైద్యులు గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే దానిపై అవగాహన కల్పించారు. అందులో అత్యంత ముఖ్యమైనది కళ్ళలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కళ్ళలో ఆ మార్పులు కనిపిస్తే కచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. వాటి గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గుండె రక్తాన్ని సరైన రీతిలో పంపకపోవడం..
గుండె పనితీరులో లయ తప్పినప్పుడు లేదా శరీరంలోని నరాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరగనప్పుడు.. మన శరీరంలో ఆటోమేటిక్‌గా కొన్ని మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా నిద్ర లేకపోవడం వల్ల కళ్లు ఉబ్బుకుంటాయి. కానీ తగినంత నిద్రపోయినా కూడా కళ్లు వాచిపోతున్నట్లైతే., ఇది గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లనే అని అర్ధం చేసుకోవాలి. గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం వలన కళ్ళ కింది భాగంలో ద్రవం పేరుకుపోతుంది. అందుకే కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తే దానిని అస్సలే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి పెను ప్రమాదంగా మారే అవకాశాలు చాలా ఉంటాయి.
పసుపు రంగు బుడగలు
కళ్లకు రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే, కళ్ళ కింద మడతలు వస్తాయి. అలాగే, కళ్ల చుట్టూ పసుపు రంగు బుడగలు ఏర్పడతాయి. ఎప్పుడైతే గుండె పనితీరు సరిగ్గా ఉండదో, అలాగే గుండె సమస్యలు ఉంటాయో అప్పుడే ఇలాంటివి ఏర్పడతాయి. దీనిని వైద్యభాషలో "జాంథెలాస్మాస్" అంటారు. మన కళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడే వారు ఈ సమస్యను నియంత్రించుకుంటే, గుండె సమస్యలు అత్యంత తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తాయి. కళ్ళు ఎప్పుడూ తేమగానే ఉంటాయి. ఒకవేళ అవి పొడిబారినట్లు అనిపిస్తే వాటికి రక్తప్రసరణ సరిగ్గా లేదని అర్ధం చేసుకోవాలి. దానర్థం గుండె సరిగ్గా పని చేయడం లేదని తెలుసుకొని వైద్యులను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications