Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
శృంగారం తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే!
ఏ ప్రాణికైనా శృంగారం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మరీ ముఖ్యంగా మానవులకు ఇది అత్యవసరమైన ప్రక్రియ. శృంగారంలో రాణిస్తేనే వివాహ బంధాలు బలంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. అయితే కొంతమంది వ్యక్తులకు ఈ విషయం పట్ల అంగీకారం, అవగాహన ఉండకపోవచ్చు. ముఖ్యంగా లైంగిక సంబంధాలు, వాటి వల్ల వచ్చే రోగాల గురించి చాలామంది తెలుసుకోకపోవడం వల్ల, తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్లు మాత్రం లక్షణాలు లేకుండా వేగంగా వ్యాపించి, వారిని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురి చేస్తాయి.
శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు, రోగాల గురించి సకాలంలో జాగ్రత్త పడకపోతే.. ఇవి వంధ్యత్వం, దీర్ఘకాలిక నొప్పులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలకు దారితీయవచ్చు. అందువల్ల, లైంగిక సంబంధాలు పెట్టుకున్న తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం అత్యంత అవసరం. అయితే శృంగారం తరువాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి?, వాటివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లైంగిక సంబంధం తర్వాత కనిపించే 5 లక్షణాలు:
జననేంద్రియాల నుండి అసాధారణ స్రావాలు:
రతి తర్వాత అసాధారణ స్రావాలు రావడం ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు. వర్ణం, వాసన ఆధారంగా స్రావం గోనేరియా లేదా క్లామిడియా వంటి ఇన్ఫెక్షన్లను సూచించవచ్చు.
తెలుపు లేదా పసుపు స్రావం గోనేరియా లేదా క్లామిడియాకు సంకేతం.
నురుగు, దుర్వాసనతో కూడిన స్రావాలు ట్రైకోమోనియాసిస్ సూచన.
ఆకుపచ్చ లేదా చీము వంటి స్రావాలు తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చూపిస్తుంది.
మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి:
లైంగిక సంభోగం తర్వాత మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి అనిపిస్తే, గోనేరియా, క్లామిడియా లేదా ట్రైకోమోనియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ల సూచన కావచ్చు. దీని వల్ల నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.
జననేంద్రియాల చుట్టూ పుండ్లు, బొబ్బలు:
హెర్పెస్ వైరస్ వల్ల బొబ్బలు ఏర్పడతాయి, ఇవి పగిలి పుండ్లుగా మారతాయి.
సిఫిలిస్ వల్ల చిన్న, నొప్పిలేని పుండ్ల నిర్మాణం మొదలవుతుంది.
HPV వల్ల జననేంద్రియాల చుట్టూ చిన్న మొటిమల రూపంలో కురుపులు ఏర్పడతాయి.
జననేంద్రియాలలో దురద లేదా మంట:
శృంగారం తర్వాత జననేంద్రియ ప్రాంతంలో నిరంతరం దురద లేదా మంట ఉంటే అది STD లక్షణం కావచ్చు. ట్రైకోమోనియాసిస్, హెర్పెస్, లేదా జఘన పేను వంటి ఇన్ఫెక్షన్లు దీనికి కారణమవుతాయి.
రతి సమయంలో నొప్పి:
లైంగిక సంబంధం సమయంలో ప్రైవేట్ పార్ట్ లేదా పొట్ట లో నొప్పి అనిపిస్తే, అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి (PID) సంకేతం కావచ్చు. PID సాధారణంగా గోనేరియా లేదా క్లామిడియా ద్వారా వస్తుంది, ఇది వంధ్యత్వం కారణమవుతుంది. అందుకే శృంగారం తరువాత మీకు అసాధారణంగా అనిపించినా, మీకేమైనా అసౌకర్యం కలిగినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి దానికి తగిన చికిత్స చేయించుకోవాలి. లేకపోతే అవి దీర్ఘకాలిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications