Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ ఆహార పదార్థాలు తింటే.. 100 శాతం మీకు HMPV వైరస్ రాదు!
చైనాలో వేగంగా విస్తరిస్తున్న HMPV వైరస్ మన దేశంలో కూడా వచ్చేసింది. ఇప్పటికే మూడు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో మన దేశంలోనూ ఈ వైరస్ గురించిన భయాందోళనలు మొదలయ్యాయి. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారికి ఈ వైరస్ సోకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు, బలహీనంగా ఉండే వ్యక్తులకు ఈ వైరస్ నుంచి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు పలు రకాల ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా మనల్ని రక్షిస్తాయి. అలాగే HMPV వైరస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సిట్రస్ ఫలాలు:
సిట్రస్ ఫలాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాటిలో ముఖ్యంగా నారింజ, నిమ్మకాయలు, గ్రేప్ ఫ్రూట్స్‌లో అద్భుతమైన విటమిన్-సీ మూలాలు కలిగి ఉంటాయి. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఆకుకూరలు
పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్, రోగాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. సాధారణమైన ఫ్లూను మన శరీరం నుంచి తరిమికొడతాయి.
అల్లం
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం HMPV వైరస్ ఉన్న వ్యక్తులకు.. దగ్గు, జలుబు వంటి సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తులు అల్లం తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
దోసకాయ
దోసకాయలో విటమిన్-కె పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
యోగర్ట్
యోగర్ట్‌లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే తిన్న ఆహరం వేగంగా జీర్ణమై.. మన శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందేందుకు సహాయపడతాయి.
బాదం
బాదంలో విటమిన్ E మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. దీని కారణంగా సాధారణమైన రోగాలను నయం చేసుకోవచ్చు.
తేనె:
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications