Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Health News: TB, HIV రోగులకు గుడ్ న్యూస్.. భారత సంతతి శాస్త్రవేత్త ప్రయోగంతో కొత్త ఆశలు
HIV treatment: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. ప్రత్యేకించి వైద్య రంగంలో ఇండియన్స్ సేవలు ఎనలేనివని చెప్పవచ్చు. కేవలం డాక్టర్స్‌గానే కాకుండా వైద్య పరిశోధనల్లోనూ తమదైన ముద్ర వేస్తూ భారత కీర్తి పతాకాన్ని నలుదిశలా వ్యాపింప చేస్తున్నారు. భారత సంతతి శాస్త్రవేత్త ఇటీవల ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు.
HIV మరియు క్షయవ్యాధి (TB)తో పోరాడుతున్న రోగులకు సహాయం చేయడంలో మంచి పురోగతిని సాధించినట్లు తాజాగా రిలీజ్ అయిన ఓ నివేదిక తెలిపింది. భారత సంతతికి చెందిన సైంటిస్ట్ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. TBని నియంత్రించడంలో క్యాన్సర్ చికిత్స ఎంతగానో సహాయపడుతుందని పరిశోధనా బృందం గుర్తించింది.

మిశ్రమ యాంటీరెట్రోవైరల్ థెరపీ (CART) అనేది HIV ట్రీట్‌మెంట్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల కలయికతో నిర్వహించే చికిత్స. తాజాగా కనిపెట్టిన ట్రీట్‌మెంట్‌కు cART జోక్యం అవసరం ఉందడు. TB కేసులను నెలల తరబడి యాంటీబయాటిక్స్‌తో నియంత్రించవచ్చు. అయితే HIV ఫలితంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులలో ఈ వ్యాధి తిరిగి సంక్రమించవచ్చు. ఈ విధంగా పుంజుకుంటున్న TB సంక్రమణ ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కంటే ఎక్కువ మరణాలకు కారణమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
'HIV మరియు TB రెండింటితో పోరాడుతున్న రోగులకు సహాయం చేయడానికి ఇదొక ముఖ్యమైన అడ్డంకిగా ఉంది' అని టెక్సాస్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టెక్సాస్ బయోమెడ్) ప్రొఫెసర్ స్మృతి మెహ్రా తెలిపారు. పీర్-రివ్యూడ్ జర్నల్ JCI ఇన్‌సైట్‌లో అధ్యయనం వివరాలు ప్రచురించబడ్డాయి. శాస్త్రవేత్త బృందం IDO (ఇండోలేమైన్-2,3-డయాక్సిజనేస్) అనే ప్రోటీన్‌పై దృష్టి సారించింది. దీనినే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు.

US FDAచే ఆమోదించబడిన హోస్ట్-డైరెక్టెడ్ థెరపీ, శరీరంలో సహజంగా కనిపించే రోగనిరోధక వ్యవస్థ ప్రోటీన్‌ను నిరోధిస్తుంది. అయితే IDO అధిక మంట మరియు అవయవ నష్టం కలిగించకుండా రోగనిరోధక వ్యవస్థను అడ్డుకుంటుందని పరిశోధన బృందం వెల్లడించింది. తక్కువ వ్యవధిలో IDOని నిరోధించడం వలన మరింత విజయవంతంగా క్యాన్సర్ చికిత్స నిర్వహించవచ్చని అధ్యయనం తేల్చింది. ఇదే విధానం యాంటీబయాటిక్స్‌తో కలిపి TB నియంత్రణను మెరుగుపరుస్తుందని మెహ్రా బృందం గతంలోనే నిరూపించింది.
వారు ఇప్పుడు TB మరియు సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (మానవ ప్రమేయం లేని HIV ప్రైమేట్ వెర్షన్) చికిత్సపై ప్రయోగాలు జరిపారు. IDO ఇన్హిబిటర్ CARTకి అంతరాయం కలిగించదని మరియు HIV ఉన్న రోగులకు సురక్షితమైనదని ఫలితాలు చూపించాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేవని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక అధ్యయనాలకు కూడా సిద్ధమయ్యారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications