Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియన్ టాయిలెట్ VS వెస్ట్రన్ టాయిలెట్.. మలబద్ధకం, పైల్స్ సమస్య రావొద్దంటే ఏది వాడాలి?
కాలానికి అనుగుణంగా సౌకర్యాలూ అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే రోగాలూ చుట్టు ముడుతున్నాయి. 30ల్లోకి రాగానే నొప్పులు మొదలవుతున్నాయి. వయస్సు పెరిగే కొద్ది మోకాలి నొప్పులు, వెన్ను నొప్పి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నొప్పుల వల్ల కూర్చోలేక, కూర్చుంటే నిల్చోలేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది.
ఈ ఇబ్బంది వల్లే ఈ మధ్యకాలంలో ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్ లు పెట్టుకోవడం పెరుగుతోంది. వయస్సు పెరిగాక ఇబ్బంది రావొద్దని, లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ఇబ్బంది పడవద్దని చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్లను ఎంచుకుంటారు. కామన్ వాష్‌రూమ్‌లో మాత్రం ఇండియన్ టాయిలెట్ ఉంచుతున్నారు.

అయితే వెస్ట్రన్ టాయిలెట్లతో పోలిస్తే ఇండియన్ టాయిలెట్లు మంచివని వైద్యులు చెబుతున్నారు. మరి ఇండియన్ టాయిలెట్లు వాడాలా, వెస్ట్రన్ టాయిలెట్ వాడాలా, ఏది వాడితే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ టాయిలెట్‌తో వ్యాయామం అవుతుంది:
ఇండియన్ టాయిలెట్ పై కూర్చోవడం వల్ల కండరాలకు వ్యాయామం అవుతుంది. దీని వల్ల కండరాలపై ఒత్తిడి ఏర్పడి వ్యాయమం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ పొజిషన్ లో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లకూ మంచి వ్యాయామం అవుతుంది.
ఇండియన్ టాయిలెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఇండియన్ టాయిలెట్ పై కూర్చోవడం వల్ల పొట్టపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే పూర్తిగా మలం బయటకు వచ్చే అవకాశం ఉంది. వెస్ట్రన్ టాయిలెట్‌పై కూర్చోవడం వల్ల పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడదు.
ఇండియన్ టాయిలెట్లు ఎకో-ఫ్రెండ్లీ:
వెస్ట్రన్ టాయిలెట్లలో శుభ్రం చేసుకోవడానికి నీటికి బదులు టాయిలెట్ పేపర్లు వాడతారు. దీని వల్ల కాగితం వృథా అవుతుంది. ఇండియన్ టాయిలెట్లలో నీటిని వాడతారు. దీని వల్ల పరిశుభ్రతతో పాటు పర్యావరణ అనుకూలత ఎక్కువ.
గర్భిణీ స్త్రీలకు ఇండియన్ టాయిలెట్లు మంచివి:
ఇండియన్ టాయిలెట్ పై కూర్చోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో గర్భాశయంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. వెస్ట్రన్ టాయిలెట్ పై కూర్చోవడం వల్ల గర్భాశయంపై ఒత్తిడి పడుతుంది. ఇండియన్ టాయిలెట్ పై క్రమం తప్పకుండా వాడటం వల్ల గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం శారీరకంగా సిద్ధం అవుతారు.
పెద్దప్రేగు క్యాన్సర్, ఇతర వ్యాధులను నివారిస్తుంది:
ఇండియన్ టాయిలెట్ పై స్క్వాటింగ్ పొజిషన్ లో కూర్చోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ సహా ఇతర వ్యాధులను నివారించవచ్చు. ఈ పొజిషన్ వల్ల మలం పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ కు కారణమయ్యే మలబద్ధకం, అపెండిసైటిస్, ఇతర సమస్యలను నిరోధిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications