Latest Updates
-
బ్రెడ్ లేకుండానే అదిరిపోయే శాండ్ విచ్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
2026 జూన్ 2: శని సంచారంతో ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థిక స్థితిగతుల్లో ఊహించని మార్పులు, అదృష్టం! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 02 జూన్ 2026 -
సన్ స్క్రీన్ ఎంత రాయాలో తెలుసా? చర్మ నిపుణులు చెబుతున్న సీక్రెట్ ఇదే! -
కొబ్బరి నీళ్లు స్ట్రాతో నేరుగా తాగుతున్నారా? అయితే ఈ ప్రాణాంతక నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
భార్యా భర్తలు పక్కపక్కన కూర్చుని ఫోన్లు చూస్తున్నారు ఈ దృశ్యం మీ ఇంట్లోనూ ఉందా? -
చికెన్ లవర్స్ కు పండుగే.. రెండు రకాల సాస్ లతో అదరగొట్టే బ్యాంగ్ బ్యాంగ్ చికెన్.. -
బయట దొరికేలాగే.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రెడ్ సాస్ పాస్తా ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు! -
బాధ పెడుతున్నా వదిలిపెట్టలేకపోతున్నారా? మనస్తత్వ శాస్త్రం చెప్పే కారణం ఇది -
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా!
Influencer Shiva Exclusive Interview: ఇష్టం వచ్చింది తింటూ బరువు ఎలా తగ్గాలో తెలుసా? శివ మాటల్లో !
ఈ మధ్య కాలంలో చాలా మందిని అతిగా ఇబ్బంది పెట్టే సమస్య అతి బరువు. మరీ ముఖ్యంగా ఫుడ్ బ్లాగర్స్ తాము ఆహారాన్ని చూపించబోయి, తామే తినేసి అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. దీని కారణంగా షుగర్, బీపీ, ఒబేసిటీ వంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ బ్లాగర్, ఇన్ఫ్లుయెన్సర్, రాజమండ్రికి చెందిన శివ కూడా ఒకరు.
అతిగా తినడం వల్ల శివ బరువు పెరగడంతో పాటు, షుగర్ వంటి రోగాల బారిన కూడా పడ్డారు. అందుకే బరువు తగ్గేందుకు ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు?, షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ఆహారాన్ని తినాలి అనేది ఆయనను EXCLUSIVEగా అడిగి తెలుసుకుందాం.

శివ ఎందుకు బరువు పెరిగారంటే?
సాధారణంగా తాను చిన్నప్పటి నుంచే అతి బరువు సమస్యతో బాధ పడేవాడినని శివ చెప్పుకొచ్చారు. తాను 100కు పైగా కేజీలు ఉండేవాడినని, కాల క్రమేణా ఆ బరువు పెరుగుకుంటూ వచ్చిందన్నారు. అయితే ఎప్పుడైతే తాను ఫుడ్ బ్లాగింగ్ మొదలుపెట్టారో అప్పటి నుంచి తన బరువు అదుపుతప్పిందని సుమారు 137 నుంచి 140 కిలోకు బరువు పెరిగానని చెప్పుకొచ్చాడు.
అందరికీ ఫుడ్ చూపించే క్రమంలో తాను కూడా అతిగా తినేవాడినని, అలా తినే క్రమంలో ఒక్క రోజే రెండు రోజులకు సరిపడా ఆహారాన్ని తినేసేవాడట. దీంతో తాను అధికంగా బరువు పెరిగిపోయానని, బరువుతో పాటు తనకు ఆరోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయని వెల్లడించారు.
శివ ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడ్డారంటే..
అడ్డు అదుపు లేకుండా ఇష్టమొచ్చించి తింటూ ఉంటే ఎవరైనా అనారోగ్యం బారిన పడాల్సిందే. అలానే శివ కూడా తన నోటికి అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్లు తినడంతో ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అందులో ఒకటి షుగర్. అలాగే ఆలాగే మొదటి నుంచే ఒబేసిటీతో బాధపడుతున్నారు కూడా. ఈ రెండు సమస్యలు జతకావడంతో ఆయనకు చాలా ఇబ్బందిగా మారింది.
నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, నడవలేకపోవడం, కూర్చున్నా, నిల్చున్నా ఇబ్బంది పడిపోవడం వంటి సమస్యలు అధికమయ్యాయట. షుగర్ కేవలం నాలుగు నెలల్లోనే మూడు పాయింట్లు పెరిగిపోయేంత స్థాయికి వచ్చేసింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే తనకు ప్రాణాపాయం అని భావించిన శివ బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అవడం మొదలు పెట్టారు.
శివ ఎలాంటి డైట్ పాటిస్తున్నారు..
సాధారణంగా బరువు తగ్గేందుకు ఇలాంటి ఆహారమే తినాలని ఏదీ ఉండదు. పెద్ద పెద్ద సినిమా హీరోలు సైతం తమకు నచ్చింది తింటూ తమకు ఇష్టమైనది తాగుతూ చాలా ఆరోగ్యవంతంగా చాలా ఫిట్‌గా తమ శరీరాన్ని మెయింటైన్ చేస్తుంటారు. శివ కూడా అలాంటి డైట్‌నే పాటిస్తున్నారు. శివకు ప్రత్యేకమైన ఒక డైట్ ప్లాన్ ఏదీ లేదట.
ఆయనకు నచ్చింది, ఆయనకు ఇష్టమైనది ఏదైనా తింటూనే బరువు తగ్గుతున్నారట. అయితే ఆయన తింటుంది ఒక క్రమణశిక్షణ పద్దతిలో తింటున్నానని, ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తినడం లేదని పేర్కొన్నారు. తాను తినే ఆహరం చాలా ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు శరీరానికి ఎంత అవసరం ఉంటుందో అంతే తింటున్నానని పేర్కొన్నారు. అలాగే షుగర్ కంట్రోల్ చేసుకునేందుకు దానికి సంబంధించిన డైట్ కూడా ప్రత్యేకంగా ఏమీ లేదని.. కాకపోతే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదని చెప్పారు. స్వీట్స్ కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ తింటున్నానని వెల్లడించాడు.
మొత్తానికి శివ తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటూనే.. తనకున్న అధిక బరువు, షుగర్ వంటి సమస్యలు తగ్గించుకుంటున్నారు. ఏది పడితే అది తినకుండా, క్రమశిక్షణలో ఎంత తినాలో అంతే తింటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మీరు కూడా శివలా బరువు తగ్గాలనుకుంటే ఇష్టమొచ్చించి తింటూ.. ఎంత తినాలో అంతే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు ఇన్ఫ్లుయెన్సర్ శివ ఇంటర్వ్యూ ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కైకి ఎలాంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications