Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్!
రోజును మనం ఎలా ప్రారంభిస్తాం అన్నదానిపైనే ఆ రోజంతా ఎలా గడుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. అందుకే రోజులో అత్యంత ముఖ్యమైన సమయం ఉదయం అని నిపుణులు చెబుతుంటారు. ఫిట్ నెస్, ఆరోగ్య స్పృహ ఉన్నవారి లిస్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ టాప్ లో ఉంటారని ఆయన అభిమానులందరికీ తెలుసు.
యాభై ఏళ్లు దాటినా కుర్రాళ్లకు దీటుగా ఫిట్ నెస్ మెయింటైన్ చేసే హృతిక్, తన ఆరోగ్య రహస్యాలకు సంబంధించిన ఒక ప్రశాంతమైన ఉదయపు దృశ్యాన్ని ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు ఎప్పుడు తీశారో కచ్చితంగా తెలియకపోయినా, నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఒక అందమైన ఉదయం(it's a good morning) అనే క్యాప్షన్ తో హృతిక్ ఐదు ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో 52 ఏళ్ల ఈ కండల వీరుడు ఒకవైపు తన ఇంట్లోని బాల్కనీలో నిలబడి, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ బ్లాక్ కాఫీ తాగుతున్న దృశ్యం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మరోవైపు, జిమ్‌లో చెమటోడ్చుతూ వర్కౌట్ చేస్తున్న ఫొటోలు ఆయన అంకితభావానికి అద్దం పడుతున్నాయి. మరొక ఫొటోలో గ్రీన్ హెల్తీ డ్రింక్ కూడా కనిపించింది.
హృతిక్ దినచర్య ఎందుకు అంత ప్రత్యేకమైనది, ఆరోగ్యకరమైనది అని విశ్లేషిస్తే.. ఆయన ఉదయం నిద్రలేవగానే హడావిడిగా రోజును ప్రారంభించరు. తన శరీరానికి, మెదడుకు మేల్కొనడానికి తగినంత సమయం ఇస్తారు. బ్లాక్ కాఫీ సిప్ చేస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నారని ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.
ఇక ఆ గ్రీన్ డ్రింక్ పట్టుకున్న చేయి హృతిక్ ది కాకపోయినప్పటికీ.. తాజా ఆకుకూరలు, పండ్లతో తయారు చేసిన పానీయంతో రోజును ప్రారంభించడం అనేది శరీరానికి అపారమైన శక్తిని, పోషకాలను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
హృతిక్ ఫిట్ నెస్ రహస్యం కేవలం ఆహారానికే పరిమితం కాలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెథిన్ మాట్లాడుతూ.. హృతిక్ వారానికి ఐదు రోజులు జిమ్ లో కచ్చితంగా వ్యాయామం చేస్తారని చెప్పారు. ప్రతిరోజూ 45 నుంచి 60 నిమిషాల పాటు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. రోజుకో శరీర భాగానికి (కండరాలకు) సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ఆయన దినచర్యలో భాగం.
షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా, జిమ్ లో అడుగుపెట్టకుండా ఆయన ఉదయం ప్రారంభం కాదు. అద్దం ముందు నిలబడి ఆయన తీసుకున్న జిమ్ సెల్ఫీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫిట్ నెస్ పట్ల ఆయనకున్న ఈ అంకితభావం చూస్తే, ఆయన్ని అందరూ ముద్దుగా గ్రీక్ గాడ్ అని పిలవడం నూటికి నూరు శాతం నిజమే అనిపిస్తుంది.
ఈ సూపర్ స్టార్ ఉదయపు అలవాట్లు మనందరికీ ఒక గొప్ప పాఠం. నిద్రలేవగానే మొబైల్ చూసుకుంటూ, పనుల కోసం కంగారు పడే బదులు.. కాసేపు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించండి. వేడి కాఫీ లేదా హెల్తీ డ్రింక్ తాగుతూ మీ శరీరానికి తగినంత సమయం ఇవ్వండి. ఆ తర్వాత శారీరక వ్యాయామానికి కొంత సమయం కేటాయించండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
