Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
క్యాన్సర్ భారీన పడకూడదంటే అడపాదడప ఇలా చేయాలంట: అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నేడు అషాఢ ఏకాదశి మరియు తొలిఏకాదశి లేదా శయన ఏకాదశి ఇలా వివిధ రకాల పేర్లతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకాలో కూడా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగతో మన తెలుగు పండగలు ప్రారంభం అవుతాయి. ఏకాదశి చాలా పవిత్రమైన పండగ. ఈ పండగ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. నదీ స్నానాలు చేసి 41 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టే వారు కూడా ఉన్నారు. ఈ పండుగతో శ్రావణం, కార్తీకం, మాఘ మాసం వంటి ముఖ్యమైన పండగలు రాబోతున్నాయి. చాలా వరకు ఈ మసాల్లో ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు. అయితే ఇలా ఉండగ పర్వదినాలకే కాకుండా అప్పడప్పుడు ఉపవాసాలు ఉండటం కూడా ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయంటున్న నిపుణులు.
సాధారణంగా బరువు తగ్గడం కోసం చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది ఒక అద్భుతమైన అనుభం. ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి అనుభవం. ఆధ్యాత్మిక పరంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పండగల సమయంలో కాకుండా అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల అతి పెద్ద ప్రాణాంతక వ్యాధిని నివారించవచ్చని అధ్యయనాలలో పెర్కొన్నారు. అవును ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చని రీసెంట్ గా కనుగొన్నట్లు అధ్యయనాల్లో వెల్లడించారు.

చాపక్రింద నీరులా స్ట్రేజ్ 3 స్టేజ్ 4కు చేరే వరకు మనషికి తెలియకుండా వచ్చే సైలెంట్ కిల్లర్ ప్రాణాంతక వ్యాధి. దీనికి ఎన్నో సంవత్సరాలు మందులు కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య చికిత్సలు నెలలు, సంవత్సరాల తరబడి చికిత్సతీసుకోవాలి. ఖర్చుతో కూడుకున్నది. రోగి దీర్ఘకాలం పాటు క్యాన్సర్ తో పోరాడాలి. కాబట్టి క్యాన్సర్ వచ్చని తర్వాత నయం చేసుకునే కంటే క్యాన్సర్ బారీన పడకుండా నివారించడం మంచిది.
ఈక్రమంలో మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు ఉపవాసం క్యాన్సర్ కణాలను ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనంలో కనుగొంది. ఉపవాసం వల్ల రోగనిరోధక యొక్క ముఖ్యమైన కణాలను పనితీరును మెరుగుపరుస్తుంది.

ఉపవాసం క్యాన్సర్ తో పోరాడే శక్తిని అందిస్తుంది
ఉపవాస సమయంలో శరీరం శక్తి కోసం చక్కెరలు కాకుండా కొవ్వుపై ఆధారపడే విధంగా న్యాచురల్ కణాలను పునరుత్పత్తి చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి మార్పు శరీరంలో క్యాన్సర్ కణాలు వ్రుద్ది చెందకుండా నాశనం చేస్తాయని అధ్యయనంలో కనుగొనబడినది. ఒక వేళ క్యాన్సర్ కణుతులు ఏర్పిడి ఉన్నాకూడు అటువంటి పరిస్థితిలో న్యాచురల్ కణాలు క్యాన్సర్ తో పోరాడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయని నిపుణులు వెల్లడించారు,
2012 మరియు 2016 లో ఎలుకపై జరిపిన పరిశోధల ఆధారంగా స్వల్పకాలి ఉపవాసం వల్ల క్యాన్సర్ నివారణ సామర్థ్యం కలిగి ఉందని అధ్యయనంలో కనుగొన్నారు. క్యాన్సర్ చికిత్సలో ప్రధానంగా ఉపయోగించే కీమోథెరఫీ చికిత్సలో ప్రమాధకరమైన ఔషధాలు మరియు శరీరంలో విషాన్ని తొలగించడానికి హానికరమైన దుష్ప్రభావాల నుండి రోగిని రక్షించడానికి ఈ స్వల్పకాలిక ఉపవాసాలు ఎంతగానో ఉపయోగపడుతాయిని సూచించింది.
జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ మరొక అధ్యయనంలో ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వరుసగా 5 రోజులు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం 2 రోజులు క్యాలరీల పరిమితితో ఉపవాసం లేదా అడపాదడప ఉపవాసం ఉండటం వల్ల కాలేయ క్యాన్సర్, కాలేయ వాపు, ఫ్యాటీ లివర్ వంటి ప్రమాధాన్ని తగ్గించవచ్చని అధ్యయనంలో కనుగొనబడినది.

మనుషులపై దీని ప్రభావం:
నివేదికప్రకారం ఉపవాసం క్యాన్సర్ ప్రమాధం తగ్గిస్తుందా అని చాలా మంది సందేహం! ఇది ఇన్సులిన్ స్థాయి మరియు సెల్యులర్ ప్రక్రియలపై ఆధారపడుతుంది. అధిక ఇన్సుల్సిన్ స్థాయిలు క్యాన్సర్ కణాలను జోడిస్తుంది. కాబట్టి, అడపాదడప ఉపవాసం ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గించుకోవడంతో పాటు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. అంతే కాదు, క్యాన్సర్ కణాలు పెరగకుండా ముందే వాటిని తొలగించే ప్రక్రియను చేపడుతుంది. అయితే ఇది రోగికి రోగికి మధ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాల కారణంగా చికిత్సతో ఇప్పటికే బరువు కోల్పోయిన రోగికి తిరిగి ఉపవాసంతో మరో సవాలుగా మారుతుంది. ఇటువంటి అధ్యయానలు క్యాన్సర్ పేషంట్స్ లో ఆశలు రేకింతించినప్పటికీ, ఈ అధ్యయనం ఎలుకలపమీద నిర్వహించబడినదిని గమనించడం ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications