Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
మనిషి ఆయుష్షు పెరుగుతోంది.. కానీ ఆ పెరిగిన కాలం ఆరోగ్యంగా, ఆనందంగా గడుస్తోందా? వృద్ధాప్యం అనగానే రోగాలతో మంచానికే పరిమితం కావాలా? ఈ ప్రశ్నలకు బదులుగా లేవండి.. యోగాతో నవయవ్వనాన్ని, ఉత్సాహాన్ని సొంతం చేసుకోండి అని పిలుపునిస్తోంది 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ ఏడాది అంటే 2026 యోగా డే థీమ్.. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Aging).

ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా శరవేగంగా పెరుగుతున్న వేళ, వారికి శారీరక, మానసిక స్వాంతన చేకూర్చడమే లక్ష్యంగా ఈ థీమ్ ని ఎంచుకున్నారు. యోగా అనేది కేవలం యువతకు, ఆరోగ్యవంతులకు మాత్రమే పరిమితం కాదని, పండుటాకులకు సైతం అదొక సంజీవని అని ప్రపంచానికి చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం.
స్వతంత్రంగా, సగర్వంగా జీవించేలా..
వయసు మీద పడేకొద్దీ కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు, మతిమరుపు, ముఖ్యంగా ఒంటరితనం తీవ్రంగా వేధిస్తుంటాయి. అయితే నిత్యం యోగా సాధన చేయడం వల్ల వృద్ధుల్లో శారీరక చురుకుదనం పెరుగుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ కాలం బతకడం కాదు.. బతికినంత కాలం ఎవరిపైనా ఆధారపడకుండా, స్వతంత్రంగా, గౌరవప్రదంగా జీవించడమే నిజమైన ఆరోగ్యకరమైన వృద్ధాప్యం.
ఈ జీవన నాణ్యతను పెంచడంలో యోగా అద్భుతంగా పనిచేస్తుందని అంతర్జాతీయ పరిశోధనలు సైతం తేల్చి చెబుతున్నాయి. వయసుకు తగ్గ ఆసనాలు, ప్రాణాయామం వృద్ధుల శరీరంలో సమతుల్యతను పెంచి జారిపడే ప్రమాదాలను, వయసు సంబంధిత రుగ్మతలను దూరం చేస్తాయి.

సరికొత్త పుంతలు తొక్కుతున్న సిల్వర్ ఎకానమీ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల అవసరాల చుట్టూ తిరిగే ఆర్థిక వ్యవస్థ (సిల్వర్ ఎకానమీ) వేగంగా విస్తరిస్తోంది. వృద్ధుల ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్, రిహాబిలిటేషన్, వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ వంటి రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో యోగా కేవలం ఒక వ్యాయామంగానే కాకుండా, ఆర్థిక వృద్ధికి తోడ్పడే నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యోగా పద్ధతులు ఇప్పుడు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వారి శారీరక స్థితికి అనుగుణంగా శ్వాసకోశ వ్యవస్థను బలపరిచే, కండరాలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచే విధానాలు ప్రాచుర్యం పొందుతున్నాయి.
అందరికీ సులువుగా చేరువవుతున్న యోగా..
యోగా అంటే కింద కూర్చుని, శరీరాన్ని విలులా వంచి చేసే కష్టమైన ఆసనాలు మాత్రమే కాదు. వయసు పైబడిన వారు, నడవలేని వారి కోసం కుర్చీలో కూర్చుని సునాయాసంగా చేసే చైర్ యోగా, తక్కువ శారీరక ఒత్తిడి ఉండే వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా వృద్ధులు ఇళ్లలోనే ఉంటూ యోగా నేర్చుకుంటున్నారు. కమ్యూనిటీ వెల్‌నెస్ కార్యక్రమాల్లో తోటి వారితో కలిసి యోగా చేయడం ద్వారా వారు ఒంటరితనాన్ని జయించి, సామాజిక అనుబంధాలను మెరుగుపరుచుకుంటున్నారు.
యోగాను కేవలం జూన్ 21వ తేదీకే పరిమితం కాకుండా, ఏడాది పొడవునా దైనందిన జీవితంలో భాగం చేయాలన్నది ప్రస్తుత లక్ష్యం. పెరుగుతున్న వృద్ధుల జనాభాను దృష్టిలో ఉంచుకుంటే.. భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో యోగా తిరుగులేని ఆయుధంగా మారబోతోందని 2026 యోగా దినోత్సవ థీమ్ స్పష్టం చేస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications