Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
ఆధునిక కాలంలో దంపతులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. అందుకు తగ్గట్టుగానే వైద్య రంగంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొందరికి ఏళ్లు దాటినా తల్లిదండ్రులయ్యే భాగ్యం కలగడం లేదు. కానీ యోగాతో ఈ సమస్యను సహజంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవితాల్లో అంతర్భాగమైంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న విస్తృత ప్రచారం కారణంగా యోగాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఎందుకంటే మన పూర్వీకులు మనకు అందించిన అరుదైన కానుక ఇది. అందుకే తమ దినచర్యలో భాగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మారుతున్న జీవనశైలిలో యోగాను డైలీ రొటీన్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది నుంచి మీ జీవితంలో భాగం చేసుకోండి.
యోగాతో ఆరోగ్యం
ముఖ్యంగా వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల్లో ఒత్తిడి, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి యోగా మంచి పరిష్కారం అందిస్తోంది. రూ. వేలల్లో మందులు వాడినా ఫలితం దక్కని వారు యోగాసనాలతో తమ జీవనశైలిని అద్భుతంగా మలచుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న వారికి సైతం యోగా పరిష్కారం చూపిస్తూ తల్లిదండ్రులయ్యే భాగ్యం కల్పిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి కేంద్రాలకు కొదవే లేదు. పెరుగుతున్న ఫెర్టిలిటీ సమస్యలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. మందులు, ఇంజెక్షన్లు, ఐయూఐ, ఐవీఎఫ్ ఇలా ఎన్నో రకాల చికిత్సలతో విసిగి వేసారిన వాళ్లూ ఉన్నారు. కానీ ఎన్ని రకాల చికిత్సలు వాడినా మెదడు, మనసు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఈ రెండూ తమ పనులు సవ్యంగా కొనసాగిస్తేనే శరీరం ఏ ఒత్తిడి లేకుండా సంతానోత్పత్తికి సహకరిస్తాయి. అందుకే ఇప్పుడు సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతుల జీవితాల్లో యోగా కీలకంగా మారింది.

ఇంప్లాంటేషన్ యోగా
గర్భధారణ ప్రక్రియలో అతి కీలకమైన అంశం ఇంప్లాంటేషన్. అండం, వీర్యకణాలతో ఫలదీకరణ చెందిన పిండం మహిళ గర్భాశయానికి అతుక్కుని నిలబడటమే ఈ ఇంప్లాంటేషన్ ప్రక్రియ. ఈ ప్రక్రియ సజావుగా సాగకపోతే మహిళ గర్భం దాల్చడం సాధ్యపడదు. అయితే 28 రోజుల సాధారణ రుతుచక్రంలో 20 నుంచి 26 రోజుల మధ్య పిండం అతుక్కోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే పలు యోగాసనాలు చేయడం కీలకమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
ఎలా చేయాలి..
ఈ ఇంప్లాంటేషన్ యోగా ద్వారా గర్భాశయానికి రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని యోగా ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఈ వ్యవధిలో రోజూ 20 నుంచి 25 నిమిషాల పాటు యోగాసనాలు వేయడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఇందుకు ఒక మెత్తని దిండు, యోగా మ్యాట్ సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతమైన శరీరం, మనసుతో ఈ యోగాసనాలు వేయాలి. సహజంగా గర్భం కోసం ప్రయత్నించే వారు లేదా ఐయూఐ, ఐవీఏఫ్ వంటి చికిత్సలు తీసుకున్న వారు సైతం ఈ సింపుల్ యోగాసనాలు వేయవచ్చని సూచిస్తున్నారు. మహిళలు ఈ వీడియో ద్వారా యోగాసనాలు ఫాలో అవ్వొచ్చు.
యోగా ద్వారా గర్భాశయానికి రక్త ప్రసరణ మెరుగ్గా జరగడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. సరైన ఫర్టిలిటీ డైట్ పాటిస్తూ రోజూ ఉదయాన్నే లేదా రాత్రి నిద్రపోయే ముందు ఓ అరగంటే సేపు కేటాయించినట్లయితే ఎలాంటి ఆటంకం లేని ప్రశాంతమైన నిద్రను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా శరీరం రిలాక్స్ అయి ఇంప్లాంటేషన్ ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications