Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
క్యాన్సర్ కి ప్లాస్టిక్ సర్జరీతో చెక్!.. డాక్టర్ కిన్నెరా రెడ్డి ఏం చెప్పారంటే..
మానవశరీరంపై ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తుందో తెలియని పెద్ద మహమ్మారి క్యాన్సర్. క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. చాలామందికి వీటి గురించి అవగాహన పెద్దగా ఉండదు. అలాంటివాటిల్లో ఒకటి స్కిన్ క్యాన్సర్. అయితే స్కిన్ క్యాన్సర్ అంటే ఏంటీ, అది మనకు ఉందా లేదా అని ఎలా అర్థం చేసుకోవాలి,ప్లాస్టిక్ సర్జరీలో దీనికి ఎంత భాగం ప్రాధాన్యత ఉంది వంటి దీనికి సంబంధించిన అనేక వివరాలను నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్ లోని ప్లాస్టిక్ రీకనస్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ కిన్నెర రెడ్డి మనకి తెలియజేశారు. ఆమె ఏం చెప్నారో ఇక్కడ చూడండి.
స్కిన్ క్యాన్సర్ మనకి ఉందని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి
స్కిన్ క్యాన్సర్ ఒక్కటే కాదు శరీరంలో ఏ ప్రాంతంలో అయినా మనకు అనుమానాస్పదంగా గడ్డ గానీ, నొప్పి గానీ లేదా బ్లీడింగ్ అవడం అనిపిస్తే వెంటనే డాక్టర్లకు దాన్ని చూపించుకోవడం ద్వారా ప్రారంభదశలోనే దానిని గుర్తించవచ్చని కిన్నెర రెడ్డి తెలిపారు.

ఆంకో ప్లాస్టిక్ లేదా ఆంకో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటీ
క్యాన్సర్ వల్ల ఏదైనా పార్ట్ కోల్పోతారో ఆంకో సర్జన్ ఆ పార్టీ తీసేసి ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా మళ్లీ ఆ పార్ట్ ని రీకనస్ట్రక్ట్ చేయగలిగితే దానిని ఆంకో ప్లాస్టిక్(onco plastic)అంటారు. బ్రెస్ట్ అయినా లేదా బాడీలో ఏ పార్ట్ కి అయినా ఇలా చేయవచ్చని కిన్నెర రెడ్డి తెలిపారు. పేషెంట్ బాడీ సొంత టిష్యూస్ తో రీకనస్ట్రక్ట్ చేయవచ్చు అని, కండగానీ, చర్మం గానీ తీసి క్యానర్స్ ఆపరేషన్ చేసిన పార్ట్ ని మళ్లీ పాతవిధంగా కనిపించేలా రీకనస్ట్రక్ట్ చేయవచ్చని తెలిపారు. ఒకవేళ పేషెంట్ సొంత టిష్యూస్ తో ఇలా చేయలేకపోతే ఇంప్లాంట్స్ ద్వారా క్యాన్సర్ ద్వారా ఏ పార్ట్ కోల్పోయారో ఆ పార్ట్ ని రీకనస్ట్రక్ట్ చేయవచ్చని తెలిపారు.
ఆంకో ప్లాస్టీ చేయించుకోవాలనుకుంటే ప్రభుత్వ సాయం
గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే ట్రీట్మెంట్ ఫ్రీగానే ఉంటుందని, అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఇది కవర్ అవుతుందని తెలిపారు.ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఇది మనకు అందుబాటులో ఉండదేమో అనే అపోహ చాలామంది సామాన్య ప్రజల్లో ఉంటదని, స్కీమ్ వర్తిస్తే ఖచ్చితంగా సర్జరీ ఫ్రీగా అవుతుందని తెలిపారు. ఎవరికైనా ఇన్య్యూరెన్స్ ఉంటే వారికి కూడా ఇది కవర్ అవుతుందని తెలిపారు.
ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వారికి దీనవల్ల ప్రభావం ఉండదు
ప్లాస్టిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఏడాది వయస్సు ఉన్నవారికైనా, 95 ఏళ్లు ఉన్నవారికైనా రీకనస్ట్రివ్ సర్జరీ చేయవచ్చు. వేరే ఆనారోగ్య సమస్యలున్నాయా లేదా అనే మాత్రమే చూసుకోవాల్సి ఉంటుందన్నారు.
జీవితానికి ఢోకా లేదు
క్యాన్సర్ అనగానే చాలామంది తమ జీవితం ముగిసిపోయిందని భాధపడుతుంటారని, అయితే ఆంకో ప్లాస్టిక్ ద్వారా తిరిగి మళ్లీ వాళ్ల లైఫ్ స్టైయిల్ లో కి తిరిగివెళ్లడం, వాళ్ల ఉద్యోగాలు చేసుకోవడం చూస్తుంటాం అని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications