Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ప్రెగ్నెన్సీ సమయంలో అసలు శృంగారంలో పాల్గొనవచ్చా? డాక్టర్ చెప్పిన నిజాలివే
ఏ స్త్రీ అయినా తల్లి కావాలని, అమ్మా అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. ఇక,తాను తల్లి కాబోతున్నాను అనే వార్త తెలిసిందంటే ఎగిరి గంతేస్తుంది. ప్రెగ్నెన్నీలోని ఆ తొమ్మిది నెలల ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే, ఈ ఆనందంతో పాటే ఎన్నో సందేహాలు, భయాలు మనసును చుట్టుముడతాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం సరైనదేనా? దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైనా హాని జరుగుతుందా? ఇది దాదాపు ప్రతి జంటను తొలిచేసే ప్రశ్న. చాలా జంటలు కడుపులో బిడ్డకు ఏదైనా ఇబ్బంది అవుతదేమోనని భయపడి పెగ్నెన్నీ టైంలో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. ఈ అపోహల కారణంగా అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ అయోమయానికి తెరదించుతూ ప్రఖ్యాత గైనకాలజిస్ట్ డాక్టర్ సుప్రియా పాఠక్ కొన్ని కీలక విషయాలను చెప్పారు.
కలయిక సురక్షితమేనా!
డాక్టర్ సుప్రియా ప్రకారం మీ గర్భం ఆరోగ్యకరంగా ఉండి, డాక్టర్లు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు సూచించనట్లయితే గర్భధారణ సమయంలో శృంగారంలో పాల్గొనడం పూర్తిగా సురక్షితం. కడుపులోని బిడ్డ గర్భాశయంలో అత్యంత పటిష్టమైన కండరాల పొరల మధ్య, అమ్నియోటిక్ ద్రవంతో నిండిన సంచిలో ఎంతో భద్రంగా ఉంటుంది. సాధారణమైన శారీరక కలయిక వల్ల ఆ చిన్నారికి ఎలాంటి హాని జరగదని ఆమె తెలిపారు.

ఈ సందర్భాలలో శృంగారం సురక్షితం కాదు
అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రం దాంపత్య సుఖానికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.
జరాయువు ప్రెవియా (Placenta Previa): మాయ గర్భాశయ ముఖద్వారానికి అడ్డంగా ఉన్నప్పుడు.
అకాల ప్రసవం (Premature Labor): నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు.
పిండం ఎదుగుదలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు.
యోని నుంచి రక్తస్రావం లేదా అసాధారణ ద్రవాలు వెలువడుతున్నప్పుడు.
గర్భధారణలోని మూడు దశలు - ఎప్పుడు సురక్షితం?
మొదటి దశ (1-3 నెలల ప్రెగ్నెన్సీ సమయం): ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల వికారం నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కోరికలు తగ్గవచ్చు. స్త్రీ సౌకర్యంగా భావిస్తే కలయికలో పాల్గొనవచ్చు.
రెండవ దశ (4-6 నెలలు): ఈ సమయాన్ని గోల్డెన్ పీరియడ్ గా చెప్పవచ్చు. శారీరక ఇబ్బందులు తగ్గి, శక్తి పుంజుకుంటుంది. లైంగిక కోరికలు కూడా సాధారణ స్థితికి వస్తాయి. ఇది శృంగారానికి అత్యంత అనువైన, సురక్షితమైన సమయం.
మూడవ దశ (7-9 నెలలు): పెరుగుతున్న పొట్ట కారణంగా కొద్దిగా అసౌకర్యం కలగవచ్చు. డాక్టర్లు వద్దని చెప్పనంత వరకు స్త్రీకి సౌకర్యవంతంగా ఉండే భంగిమలలో కలయిక కొనసాగించవచ్చు.
తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
-స్త్రీ సౌకర్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమెపై ఎలాంటిఉండకూడదు.
-ఇద్దరూ వ్యక్తిగత శుభ్రతను ఖచ్చితంగా పాటించాలి.
-భాగస్వాముల్లో ఎవరికైనా లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STI) లేవని నిర్ధారించుకోవడం ముఖ్యం.
-కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం లేదా ఏమాత్రం అసౌకర్యం కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించడం శ్రేయస్కరం.
-సరైన అవగాహనతో,డాక్టర్ల సలహాలు పాటిస్తూ గర్భధారణ సమయంలో కూడా మీ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications