Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మండే ఎండలు రాకముందే..చల్లని చెరకు రసం తాగడం మంచిదేనా?
ఎండకాలం వచ్చేస్తోంది. మార్చి నెలలోకి అడుగుపెట్టేందుకు కేవలం 10 రోజులే మిగిలున్నాయి. ప్రస్తుతానికి ఉదయం టైంలో కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడు తన ప్రతాపాన్ని నెమ్మదిగా చూపించడం మొదలుపెడుతున్నాడు.
అయితే ఎండాకాలం పూర్తిగా రాకముందు నుంచే రోడ్ల పక్కన చెరకు రసం బండ్ల దగ్గర రష్ కనబడుతోంది. ఎండ వేడికి గొంతు ఎండిపోతుంటే, కళ్ళ ముందు చల్లని చెరకు రసం కనిపిస్తే వెంటనే ఆగి ఒక గ్లాసు తాగేయాలనిపిస్తుంది. కానీ అసలు ఈ సమయంలో చెరకు రసం తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

రుచి కోసం తాగి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నామా? మారుతున్న వాతావరణంలో మన ఆహారపు అలవాట్ల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో చెరకు రసం తాగే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.
ఇప్పుడే తాగడం మంచిదేనా?
చెరకు రసాన్ని నేచురల్ కూల్ డ్రింక్ గా, ఎండ తాపాన్ని తగ్గించే డ్రింక్ పరిగణిస్తారు. మే, జూన్ నెలల్లో మండే ఎండలకు, వడదెబ్బ తగలకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ఫిబ్రవరిలో. ఇది చలికాలం ముగిసి, వేసవికాలం ప్రారంభమయ్యే సమయం. ఈ సమయంలో వాతావరణం చాలా వేగంగా మారుతుంటుంది.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇలాంటి సమయంలో మరీ చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం తొందరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ సీజన్ లో చేసే చిన్న పొరపాటు కూడా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరానికి దారితీస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి
మీకు చెరకు రసం అంటే బాగా ఇష్టమైతే లేదా దాహం తీర్చుకోవడానికి తాగాలనుకుంటే ఈ కింది నియమాలు పాటించడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవచ్చు.
ఐస్ వద్దు.. ఆరోగ్యం ముద్దు
ఈ సీజన్ లో మీరు చేసే అతి పెద్ద తప్పు చెరకు రసంలో ఐస్ వేయించుకోవడం. బండి దగ్గరికి వెళ్ళగానే ఐస్ లేకుండా ఇవ్వండి అని చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడున్న వాతావరణానికి ఐస్ వేసిన రసం తాగితే వెంటనే గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
అల్లం, నిమ్మరసం మ్యాజిక్
కేవలం చెరకు రసం మాత్రమే కాకుండా అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం లేదా పుదీనా వేయించుకుని తాగండి. అల్లం, నిమ్మరసం చెరకు రసం చల్లదనాన్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా జీర్ణశక్తిని పెంచి, గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
సమయం చూసి తాగండి
ఉదయం పూట లేదా సాయంత్రం చల్లబడిన తర్వాత చెరకు రసం జోలికి వెళ్లకండి. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తాగడం మంచిది. అది కూడా పరిమితంగానే ఉండాలి.
అతిగా వద్దు
ప్రస్తుతానికి రోజువారీ అలవాటుగా చెరకు రసం తాగడం మంచిది కాదు. ఎప్పుడైనా రుచి కోసం తాగేటప్పుడు కూడా మోతాదు 100 నుండి 200 ml మించకుండా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications