Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఉదయాన్నే మూత్రం తాగితే మంచిదా? మన మాజీ ప్రధాని ఫిట్ నెస్ సీక్రెట్ అదేనా!
పొద్దున్నే మన మూత్రాన్ని మనమే తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, మూత్రాన్ని మొఖానికి రాసుకుంటే మృదువుగా తయారవుతుందని,మలబద్దకం సమస్య పోతుందని,డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని తరుచుగా చాలామంది చెప్తుండటం మనం విని ఉంటాం. తమ మూత్రాన్ని తామే తాగడాన్ని 'యూరిన్ థెరపీ' అంటారు. కరోనా సమయంలోనే చాలామంది నేతలు కూడా తమ మూత్రాన్ని తామే తాగితే కరోనా నుంచి బయటపడవచ్చని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు.
మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా పొద్దున్నే తన మూత్రాన్ని తనే తాగేవాడు. తన ఫిటెనెస్ రహస్యం ఖాళీ కడుపుతో తన మూత్రం తానే తాగడమని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన ఈ అలవాటును 'నేచురల్ ట్రీట్మెంట్' గా అభివర్ణించారు. ఫిట్‌గా ఉండేందుకు కొన్ని జంతువులు కూడా వాటి మూత్రాన్ని అవే తాగుతాయని ఆయన చెప్నారు.

డాక్టర్లు ఏమంటున్నారు
అయితే మూత్రం తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. మూత్రం అనేది శరీరం నుంచి వెలువడే వ్యర్థ పదార్థం. అందులో నీటితోపాటు శరీరం వదిలించుకునే వ్యర్థాలు ఉంటాయి. మూత్రపిండాల సమస్యలు లేనప్పుడు మూత్రం శుభ్రంగానే ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే శరీరం లోపల ఉన్నప్పుడు ఓకే కానీ బయటకు రాగానే అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. దాన్ని తాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయొచ్చని పేగులకు,కిడ్నీలకు ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. ఒక్క ముక్కలో సింపుల్ గా చెప్పాలంటే మూత్రం తాగడమంటే శరీరం వదిలించుకున్న ప్రమాదకర పదార్థాలను మళ్లీ శరీరంలోకి పంపినట్లేనని తెలిపారు.
పాతకాలంలోనే మెడిసిన్ గా
మూత్రం తాడం ద్వారా శరీరానికి విటమిన్లు తొందరగా అందుతాయని కొందరు భావిస్తారు. అయితే విటమిన్ల కోసం ఆహారం తీసుకోవాలి తప్ప ఇలా చేయడం మంచిదని కాదని హెచ్చరిస్తున్నారు.అయితే రోమ్, గ్రీస్, ఈజిప్ట్ నాటి కాలానికి సంబంధించిన అనేక నివేదికలలో క్యాన్సర్ సహా అనేక వ్యాధులకు ట్రీట్మెంట్ చేయడానికి యూరిన్ థెరపీని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. ఒకప్పుడు డాక్టర్లు మూత్రంలో మధుమేహాన్ని పరీక్షించేవారు.
అక్కడ ఇప్పటికీ
ఇప్పటికీ చైనాలో చాలామంది తమ మూత్రాన్ని తామే తాగుతుంటారు. తమ కళ్ళు, ముఖాన్ని కూడా మూత్రంతో శుభ్రపరుచుకుంటారు. ఇలా చేయడం వలన ముఖంలో మెరుపుదనం వస్తుందని, దృష్టి మెరుగుపడుతుందని వారు నమ్ముతుంటారు. మూత్రాన్ని కంటి చుక్కలుగా కూడా ఉపయోగిస్తారు. యూట్యూబ్ లో కూడా చాలామంది చైనా యూట్యూబర్లు రోజూ మూత్రం తాగడం, దానివల్ల వారికి కలుగుతున్న ప్రయోజనాలు గురించి చెప్పే వీడియోలు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications