Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
కడుపులో కాస్త ఉబ్బరంగా అనిపించినా, గ్యాస్ లేదా ఛాతీలో మంటగా అనిపించినా వెంటనే మెడికల్ షాప్‌కు వెళ్లి ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవడం మనలో చాలామందికి ఉన్న అలవాటు. ఒకట్రెండు సార్లు ఇలా జరిగితే పర్వాలేదు కానీ ఇది పదేపదే రిపీట్ అవుతుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే.
తరచుగా అజీర్ణం, కడుపునొప్పి, మాటిమాటికీ కామెర్లు రావడం లాంటి లక్షణాలను సాధారణ ఆరోగ్య సమస్యలుగా కొట్టిపారేయకండి. డాక్టర్ల హెచ్చరికల ప్రకారం, ఈ చిన్నపాటి లక్షణాల వెనుక అత్యంత ప్రమాదకరమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (క్లోమగ్రంథి క్యాన్సర్) పొంచి ఉండే ప్రమాదం ఉంది.

చాపకింద నీరులా వ్యాపించే సైలెంట్ కిల్లర్
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లలో.. ప్యాంక్రియాటిక్ డక్టల్ అడెనోకార్సినోమా అనే రకం అత్యంత భయంకరమైనది. ఈ క్యాన్సర్ ప్రధాన లక్షణం ఏమిటంటే.. ఇది సైలెంట్ గా శరీరంలో వ్యాపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లో దీనిని కనుగొనడం దాదాపు అసాధ్యం. ఇది మనకు ఏమాత్రం అనుమానం రాకుండా శరీరంలో పాతుకుపోతుంది.
క్యాన్సర్ ముదిరేకొద్దీ కొన్ని లక్షణాలు బయటపడతాయి, కానీ దురదృష్టవశాత్తూ వాటిని మనం గ్యాస్ట్రిక్ సమస్యలుగా పొరబడతాము. ఇది ఒకసారి వేగంగా వ్యాపించడం మొదలైతే, దానిని అదుపు చేయడం డాక్టర్లకు సైతం కత్తిమీద సామే.
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
ఈ సైలెంట్ కిల్లర్ బారిన పడకుండా ఉండాలంటే, మన శరీరం ఇచ్చే ఈ కింది హెచ్చరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.
తరచుగా వచ్చే కామెర్లు
పసికర్లు లేదా కామెర్లు మాటిమాటికీ వస్తున్నాయంటే అది ఏమాత్రం మంచి సంకేతం కాదు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నవారిలో ఈ లక్షణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
తగ్గని అజీర్ణం
సమయానికి తినకపోవడం వల్లనో, మసాలాలు ఎక్కువగా తినడం వల్లనో అజీర్ణం రావడం సహజమే. కానీ, మందులు వాడుతున్నా కూడా అజీర్ణం తగ్గకుండా, రోజువారీ జీవితాన్ని పీడిస్తుంటే మాత్రం అది క్యాన్సర్ తొలిదశ లక్షణం కావొచ్చు.
పొట్టను తొలిచేసే నొప్పి
కడుపు పైభాగంలో మొదలయ్యే తీవ్రమైన నొప్పి క్రమంగా పొట్ట మొత్తం, ఆపై వీపు భాగానికి వ్యాపిస్తుంది. ఒక్కోసారి ఈ నొప్పి ఛాతీలో కూడా రావచ్చు. దీనికి తోడు ఏదైనా తినగానే వాంతులు అవ్వడం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా క్యాన్సర్‌కు స్పష్టమైన సంకేతం.
ఎవరు ఎక్కువ జాగ్రత్త పడాలి?
అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే అయినప్పటికీ, కొన్ని వర్గాల వారికి దీని ముప్పు ఎక్కువ. అధిక బరువు (ఒబేసిటీ) ఉన్నవారు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు, పెద్దప్రేగు సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో కడుపు లేదా పిత్తాశయానికి ఆపరేషన్ జరిగినవాళ్లు, పిత్తాశయంలో రాళ్లు (గాల్ బ్లాడర్ స్టోన్స్) ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
