Latest Updates
-
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు!
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
మహిళల జీవితంలో బుుతుస్రావం అనేది సహజ ప్రక్రియ. నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఈ టైంలో వ్యాయామం చేయవచ్చా అనే విషయంపై చాలా మందిలో పలు సందేహాలు నెలకొంటున్నాయి. అసలు పీరియడ్స్‌లో ఎక్సర్‌సైజ్ చేయవచ్చా.? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.? ఇక్కడ చూద్దాం..

నెలసరి సమయంలో ఒక్కో మహిళ శరీరం ఒక్కో విధంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా వివిధ రకాల మార్పులను అనుభవిస్తుంటారు. కొందరిలో కడుపు నొప్పి, కండరాల నొప్పులు, నడుము నొప్పి, అలసటతో పాటు మానసికంగా ఉద్వేగానికి గురవుతుంటారు. దీని వల్ల రోజువారీ కార్యకాలాపాలు చేసుకోలేరు. చాలా వరకు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంటుంది. అయితే కొందరు పీరియడ్స్ టైంలో డైలీ రొటీన్‌ను చేసుకోగలుగుతారు. విశ్రాంతి తీసుకుంటూనే పనులు పూర్తి చేసుకుంటారు. ఇవన్నీ సాధారణం కాగా.. కొందరిలో మాత్రం ఎక్సర్‌సైజ్ విషయంలో చాలా రకాల సందేహాలు వ్యక్తమవుతుంటాయి.
పీరియడ్స్ టైంలో కొందరు అసౌకర్యంగా ఫీలవుతుంటే.. మరికొందరిలో ఇది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మహిళ తన శరీర అవసరాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మేలు చేస్తుందని గైనకాలజిస్ట్ నిపుణులు అంటున్నారు. దీనిపై సరైన అవగాహన లేకపోతే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం సమయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
వ్యాయామంతో ప్రయోజనాలే..
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమైనదిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్‌లో ఆరోగ్యంగా ఉండి నీరసం, నొప్పి వంటివి ఎక్కువగా లేకపోతే సాధ్యమైనంతవరకూ రోజువారీ కార్యకలాపాలను చేసుకోవచ్చని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కొందరి మహిళల్లో నెలసరి నొప్పులు, అలసట, మానసిక స్థితిలో ఉద్వేగాలను తగ్గించడంలో దోహదపడుతుందని అంటున్నారు.
శరీరానికి శక్తి
బుుతుస్రావం సమయంలో తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శక్తిని పెంచుతుంది. అయితే నెలసరిలో నొప్పి పెరిగినా, తల తిరిగినట్లు అనిపించినా, అధిక రక్తస్రావమైనా, అసౌకర్యంగా అనిపించినా విశ్రాంతి తీసుకోవాలి. మీ బాడీ ఇచ్చిన సిగ్నల్స్‌ను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఏ వ్యాయామాలు ఉత్తమం..
పీరియడ్స్ టైంలో తేలికపాటి, సౌకర్యవంతం వ్యాయామాలు చేయడం బెటర్ అని గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా వాకింగ్ చేయడం, తేలికపాటిగా స్ట్రెచింగ్ చేయడం, యోగాసనాలు వేయడం, సైక్లింగ్, సింపుల్‌గా ఉండే ఏరోబిక్ వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమాన్ని కలిగించి యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. మానసికంగా ఉత్తేజాన్ని ఇస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. అలసటను నివారిస్తుంది. సాధారణ రోజుల్లో వ్యాయామం చేస్తున్న వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకపోతే ఈ సమయంలోనూ కంటిన్యూ చేయవచ్చు. మీ శక్తి, సామర్థ్యం మేరకు వ్యాయామ పద్ధతులను ఎంచుకోండి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బుుతుస్రావం సమయంలో వ్యాయామం చేసే ముందు, తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించాలి. బ్లీడింగ్ లీక్ అవ్వకుండా నాణ్యమైన, తగిన శానిటరీ ఉత్పత్తులను వాడటం మంచిది. ఈ సమయంలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపించినా విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం. తీవ్రమైన అసౌకర్యం, నొప్పి అనిపిస్తే వైద్యుడిని సంప్రదించి వారి సలహాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
