Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఆ సమయంలో సెక్స్ చేసుకోవచ్చా?
యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్‌ని ఈస్ట్ వాజినైటిస్ లేదా యోని కాన్డిడియాసిస్ అని కూడా అంటారు. ఇది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య. యోనిలో ఫంగస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా రుతుక్రమం సమయంలో కనిపిస్తుంది. రుతుక్రమం ప్రారంభం కానీ లేదా ఆగిపోయిన మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమయంలో సెక్స్ లో పాల్గొనవచ్చా.. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ శృంగారం చేస్తే కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్:
యోనిలో కాండిడా ఆల్బికాన్స్ వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధి కాదు. అసలెప్పుడూ సెక్స్ లో పాల్గొని స్త్రీలలో కూడా ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. అయితే లైంగికంగా చురుకుగా ఉండే స్త్రీలలో ఇది చాలా సాధారణం. మధుమేహం ఉన్న మహిళల్లో కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా రక్తం చక్కెర స్థాయిని నియంత్రించకపోతే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. హెచ్ఐవీ లేదా స్టెరాయిడ్స్, కీమోథెరపీ లేదా పోస్ట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ మందులు వంటి కొన్ని మందుల వాడకం కారణంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఈస్ట్ ఇన్ఫెక్షన్ రావొచ్చు.
* ఇది భాగస్వామికి సంక్రమించవచ్చు
* ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమయంలో సెక్స్ బాధాకరంగా ఉంటుంది
* సెక్స్ చేస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్ తీవ్రం కావొచ్చు
* ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్స్ చేస్తే అది నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కండోమ్ వాడి సెక్స్ చేయవచ్చా:
సెక్స్ సమయంలో బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడానికి కండోమ్ ని ఉపయోగించడం ద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో లైంగిక సంబంధం ఉండటం వల్ల దురద, మంట వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.
ఈస్ట్ ఇన్ఫంక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యులు యాంటీ ఫంగల్ మందులు సూచిస్తారు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి.. క్రీమ్, జెల్, లేదా టాబ్లెట్స్ ఇవ్వొచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి మందులను ప్రభావిత ప్రాంతంలో పూయాల్సి ఉంటుంది. చికిత్స ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈస్ట్ ఇన్ఫెక్షన్ పూర్తి నయం అవుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ పూర్తి తొలగిపోయాక 5 నుండి 7 రోజుల తర్వాత సెక్స్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications