Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
హస్తప్రయోగం మంచిదేనా? వారానికి ఎన్నిసార్లు చేస్తే సేఫ్!
మన శరీరానికి వివిధ అవసరాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సరైన ఆహారం, మల్టీవిటమిన్లు, ఖనిజాలు అవసరం. అదే విధంగా లైంగిక ఆరోగ్యానికి ఉద్వేగం అవసరం. భావప్రాప్తికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది మీకు భాగస్వామి ఉంటే వారితో మీరు శృంగారం చేయవచ్చు.. రెండవది మీకు భాగస్వామి లేకపోతే హస్తప్రయోగం.
రిలీఫ్ కోసం
హస్తప్రయోగం అనేది లైంగిక అవసరాలను తీర్చడానికి ఒక మార్గం. పూర్వకాలంలో పెళ్లిళ్లు త్వరగా జరిగేవి కాబట్టి అబ్బాయిలకు, అమ్మాయిలకు కూడా హస్త ప్రయోగం అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి శారీరక సంతృప్తి కోసం హస్తప్రయోగం అవసరంగా భావిస్తున్నారు చాలామంది. అంతేకాకుండా ఏదైనా టెన్షన్ లేదా ఒత్తిడిలో ఉన్నా హస్త ప్రయోగం చేసి రిలీఫ్ పొందుతుంటారు కొందరు పురుషులు.

హస్త ప్రయోగం మంచిదేనా?వారంలో ఎన్నిసార్లు చేస్తే సేఫ్
హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదని కొందరు..దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటామని మరికొందరు చెబుతుంటారు. దీంతో పురుషులు హస్తప్రయోగం చేయడం మంచిదా కాదా? ఇందులో వాస్తవమెంత? అపోహలేంటి? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతాయి. వాస్తవానికి వాస్తవానికి హస్త ప్రయోగం వల్ల ఎలాంటి నష్టాలు లేవని ఓ వైద్య నిపుణుడు తెలిపారు.
వారానికి 1 లేదా రెండు సార్లు హస్త ప్రయోగం చేయడం ఆరోగ్యకరమని ఎందుకంటే మన వీర్యం అనేది శరీరం లోపల ఉత్పత్తి అయిపోయిన తర్వాత మీరు అసలు హస్తప్రయోగమే చేయకపోతే మనకు యూరిన్ వచ్చే ఛానల్ స్పెర్మ్ వచ్చే ఛానల్ ఒకటే ఉంటుంది.. యూరిన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఒక డ్రాప్ ఏదైనా రీఫ్లెక్స్ అయ్యి వెనక్కి వెళ్లినా ఆ స్పెర్మ్ లో ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంటుంది. కాబట్టి హస్త ప్రయోగం చేయడం ద్వారా అది బయటకు వెళ్లిపోతుందని తెలిపారు.
అసలు హస్తప్రయోగం చేయకపోతే 10-12 రోజుల తర్వాత శరీరం మీకు తెలియకుండానే నైట్ ఫాల్ అయిపోతుందని తెలిపారు. యూరిన్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువసేపు రిలీజ్ చేయకపోతే బాడీలో పెయిన్స్ వస్తాయని, అదేవిధంగా వీర్యం ఎక్కువ స్టోరేజ్ అయితే పెయిన్స్ వస్తాయని తెలిపారు. హస్తప్రయోగం కూడా ఒకలాంటి ఎక్సర్ సైజ్ అని తెలిపారు. అయితే అతిగా హస్త ప్రయోగం చేయడం వల్ల అంటే ఒక రోజులో నాలుగైదు సార్లు అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
శరీరం ఎదుగుదల ఆగిపోతుందా
ఆరోగ్య పరంగా చూస్తే పెద్ద భారీ ప్రయోజనాలు ఏమీ లేవు కానీ హస్త ప్రయోగం వల్ల ఎలాంటి నష్టం కూడా లేదు. హస్త ప్రయోగం వల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుందని చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని ఇందులో ఎలాంటి నిజం లేదని వైద్య నిపుణుడు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications










