Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే!
యాంటీబయాటిక్స్ అనగానే ఇన్ఫెక్షన్లను ఇట్టే మాయం చేసి, ప్రాణాలు కాపాడే అద్భుతమైన మందులు మనకు గుర్తొస్తాయి. ఆధునిక వైద్యంలో ఇవి ఒక సంచలనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది.
ఒకే తరహా ఇన్ఫెక్షన్ల కోసం వాడే, రసాయనికంగా దాదాపు ఒకేలా ఉండే కొన్ని యాంటీబయాటిక్స్ మన లివర్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంట. ఐఐటీ బాంబే, మలేషియాలోని సన్ వే యూనివర్శిటీ సైంటిస్టులు సంయుక్తంగా చేసిన ఒక సరికొత్త అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది.

బలం కాదు.. స్థానమే అసలు సమస్య
ఒక మందు కాలేయానికి ఎంత హాని చేస్తుందనేది ఆ మందు బలంపై ఆధారపడి ఉంటుందని, మందులు కాలేయ కణాల పొరలను విచ్ఛిన్నం చేయడం వల్లే కాలేయం దెబ్బతింటుందని ఇప్పటివరకు అంతా భావించేవారు.
కానీ అసలు సమస్య ఈ విచ్ఛిన్నంలో కాకుండా, ఆ మందు కాలేయ కణాల పొరతో ఎక్కడ, ఎంత సమయం పాటు ప్రతిచర్య జరుపుతోంది అనే సూక్ష్మమైన విషయంపై ఆధారపడి ఉందని ఈ తాజా అధ్యయనం నిరూపించింది.
ఒకేలా ఉండే రెండు మందులు.. వేర్వేరు ఫలితాలు
దీన్ని నిరూపించడానికి పరిశోధకులు న్యుమోనియా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ట్రీట్మెంట్లలో వాడే టెయికోప్లానిన్,ఒరిటావాన్సిన్ అనే రెండు బలమైన యాంటీబయాటిక్స్ ను తీసుకున్నారు. ఈ రెండూ బ్యాక్టీరియాతో ఒకేలా పోరాడుతాయి. కానీ టెయికోప్లానిన్ వాడిన రోగుల్లో కాలేయ సమస్యలు రావడం గమనించారు.
దీనివెనుక ఉన్న రహస్యాన్ని అధ్యయనం ఛేదించింది. ఒరిటావాన్సిన్ మందు కాలేయ కణ త్వచంలోని లోతైన కొవ్వు పొరల్లోకి చొచ్చుకుపోయి అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. దీనివల్ల కణాల సాధారణ విధులకు ఎలాంటి ఆటంకం కలగదు. కానీ టెయికోప్లానిన్ అలా కాదు.
ఇది కణాల బయటి పొరపైనే ఎక్కువ కాలం అతుక్కుపోయి, అక్కడి విద్యుత్ ఆవేశాలను, కణాల కదలికలను నెమ్మదిగా మారుస్తుంది. పైకి ఇది చిన్న విషయంగానే కనిపించినా, నిరంతరంగా ఇలా జరగడం వల్ల కణాల ఉపరితల ప్రక్రియలకు తీవ్ర అంతరాయం కలిగి కాలేయం దెబ్బతింటుంది.

ల్యాబ్ ప్రయోగాల్లోనూ ఇదే నిజమైంది
ఈ సిద్ధాంతాన్ని పరీక్షించడానికి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. టెయికోప్లానిన్ ఇచ్చిన ఎలుకల్లో కాలేయ ఎంజైమ్ స్థాయిలు అమాంతం పెరిగిపోవడం, వాపు, కాలేయ కణాలు దెబ్బతినడం గమనించారు. అదే ఒరిటావాన్సిన్ ఇచ్చిన ఎలుకల్లో ఎంజైమ్‌లు కొద్దిగా పెరిగినా కణజాల నష్టం చాలా తక్కువగా ఉంది.
భవిష్యత్తు వైద్య రంగానికి ఇది ఎందుకు కీలకం?
చాలా మందులను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత రోగుల కాలేయాలు దెబ్బతినడం గమనించి, ఆ మందులను బ్యాన్ చేస్తుంటారు. ఇలాంటి నష్టాన్ని ఈ కొత్త పరిశోధన నివారించగలదు. మందును తయారు చేసేటప్పుడే ఆ మందు కణాల పొరతో ఎలా వ్యవహరిస్తుందో ముందుగానే అంచనా వేయవచ్చు.
తద్వారా ఫార్మా కంపెనీలు ప్రమాదకరమైన మందులను ముందుగానే గుర్తించి, రోగులకు అత్యంత సురక్షితమైన మందులను తయారు చేయవచ్చు. మనం వేసుకునే యాంటీబయాటిక్స్‌ను విచ్ఛిన్నం చేసి శరీరం నుండి పంపించే బాధ్యత కాలేయానిదే. కొన్ని మందులు కాలేయంపై ఎందుకు భారం మోపుతున్నాయో ఈ పరిశోధన కళ్లకు కట్టినట్లు వివరించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications