Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో రకరకాల అలవాట్లు, మార్పులు చోటుచేసుకుంటాయి. మట్టి పెల్లలు తినడం, దుస్తులు నోట్లో పెట్టుకుని నమలడం, బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకడం ఇలా చాలా రకాల అలవాట్లతో తల్లిదండ్రులకు కొత్త సమస్యను తెచ్చిపెడుతుంటారు. ముఖ్యంగా బొటనవేలు నోట్లో పెట్టుకోవడం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పిల్లల ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చిన్నపిల్లలు ఎక్కువగా తమను తాము శాంతపరుచుకోవడానికి లేదా సౌకర్యంగా ఉండేందుకు, నిద్ర పోయేటప్పుడు బొటనవేలు చీకుతుంటారు. సాధారణంగా రెండేళ్ల నుంచి నాలుగేళ్ల మధ్య పిల్లల్లో పిల్లల్లో ఈ అలవాటు దానంతట అదే పోతుంది. కానీ ఆ వయసు దాటినా ఈ అలవాటు అలగే కొనసాగితే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని పీడియాట్రిక్ నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి.. ఎలా మాన్పించాలి.. ఇక్కడ తెలుసుకుందాం..
కారణాలు..
పిల్లలు బొటనవేలు చీకడం ద్వారా వారిలో ఒకరకమైన భద్రతా భావం, సౌకర్యం ఏర్పడుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు, అలిసిపోయినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, నిద్ర మత్తులో ఉన్నప్పుడు ఇలా బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు. చిన్న వయసులో ఇది సాధారణ సమస్య.
దంతాల అమరిక
అయితే పిల్లల వయసు ఐదేళ్లు దాటినా ఇలాగే కొనసాగితే అది వారి శాశ్వత దంతాల అమరికపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా వంకర దంతాలు, పైన, కింది దంతాల మధ్య ఖాళీలు ఏర్పడటం, దవడ అభివృద్ధి చెందడంలో సమస్యలు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్‌ఫెక్షన్స్
పిల్లలు రోజంతా వివిధ రకాల వస్తువులను తాకుతుంటారు. దీని వల్ల చేతివేళ్లపై బ్యాక్టీరియా, వైరస్ చేరుతుంది. బొటనవేలును అలాగే నోట్లో పెట్టుకోవడం ద్వారా క్రిములు నోట్లోకి ప్రవేశించి జలుబు, దగ్గు, పొట్ట ఇన్‌ఫెక్షన్లతో పాటు ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. అదేవిధంగా చర్మం పొడిబారడం, చికాకు, గోళ్ల చుట్టూ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
నివారణ మార్గాలు
పిల్లలను తిట్టడం లేదా కొట్టడం ద్వారానో వారిలో ఈ బొటనవేలును చీకే అలవాటును మాన్పించలేరు. వారి దృష్టిని ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, ఇతర కార్యకలాపాలవైపు దృష్టి మళ్లించడం ద్వారా ఈ అలవాటును నుంచి నిదానంగా బయటపడవచ్చు. మీ పిల్లలు బొటనవేలును చీకడం మానేసినప్పుడు వారిని అభినందించండి. వారు ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు కారణాలు తెలుసుకోండి. అయినా ఈ అలవాటు మానకపోతే పీడియాట్రిక్ నిపుణుడిని సంప్రదించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. వారి దంతాల అమరికపై ప్రభావం కనిపిస్తే దంత వైద్య నిపుణుడిని కూడా కలవడం శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications