Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
షాకింగ్: పొద్దున్నే టీ,కాఫీ తాగుతున్నారా? ఈ రోగాలు గ్యారెంటీ!
పొద్దున్నే నిద్రలేవగానే చాలామంది వేడి వేడి టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఛాయ్ చుక్క గొంతులో పడందే మెదడు పనిచేయనట్టు, శరీరంలో చురుకుదనం రానట్టు అనిపిస్తుంది. కొంతమందికి అయితే టీ,కాఫీ తాగకుంటే మోషన్ కూడా రాదు అని సరదాగా చెబుతుంటారు. అయితే మనం ఎంతో ఇష్టంగా తాగే టీ,కాఫీ పరగడుపున అంటే ఖాళీ కడుపుతో తాగడం మన ఆరోగ్యానికి అమృతం పంచుతుందా లేక విషాన్ని చిమ్ముతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.
కడుపులో ఏం జరుగుతుంది?
టీ, కాఫీ రెండూ స్వభావరీత్యా ఆమ్ల గుణాన్ని (Acidic Nature) కలిగి ఉంటాయి. రాత్రంతా ఖాళీగా ఉన్న మన కడుపు ఉదయాన చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో మనం టీ లేదా కాఫీ తాగినప్పుడు వాటిలోని ఆమ్లాలు నేరుగా కడుపులోని అంతర్గత పొరలపై దాడి చేస్తాయి. ఇది శరీరంలోని యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది. మన కడుపులో ఆహారం ఉన్నప్పుడు, అది ఒక రక్షణ కవచంలా పనిచేసి ఈ ఆమ్లాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. కానీ ఖాళీ కడుపుతో ఈ రక్షణ ఉండదు. ఫలితంగా కడుపులో మంట, వాపు వంటి సమస్యలు మొదలవుతాయి.

ఈ అలవాటును దీర్ఘకాలం కొనసాగిస్తే, అది దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్ అనే తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి, అజీర్తి సమస్యలు మొదలవుతాయి. క్రమంగా ఆకలి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మరింత హానికరం.
కేవలం కడుపుకే కాదు, మరిన్ని నష్టాలు
ఈ సమస్య కేవలం కడుపుతో ఆగిపోదు. ఉదయం మనం నిద్రలేచినప్పుడు మన నోటిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం నీటితో పుక్కిలించకుండా నేరుగా టీ లేదా కాఫీ తాగినప్పుడు, ఆ పానీయంతో పాటు ఈ బ్యాక్టీరియా కూడా కడుపులోకి ప్రవేశించి,పేగులలోకి చేరుతుంది. ఇది పేగుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అంతేకాకుండా టీలో చాలా తక్కువ మోతాదులో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల దానికి నెమ్మదిగా బానిసలుగా మారే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఉదయం లేవగానే టీ తాగకపోతే తలనొప్పిగా, నీరసంగా అనిపించడం జరుగుతుంది.
సరైన పద్ధతి ఏది?
టీ, కాఫీలు ఇంత హానికరమా అని వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వాటిని తీసుకునే పద్ధతిని మార్చుకుంటే చాలు. ఉదయం నిద్ర లేవగానే, ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరచి, శరీరాన్ని మేల్కొలుపుతుంది. నీళ్లు తాగిన 10-15 నిమిషాల తర్వాత ఏదైనా పండు ముక్క, రెండు బాదం పప్పులు, ఖర్జూరాలు లేదా ఒక బిస్కెట్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. ఇది మీ కడుపులో ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇలా ఏదైనా తిన్న 15 నుండి 20 నిమిషాల తర్వాత మీరు ఎంతో ఇష్టపడే టీ లేదా కాఫీని ఆస్వాదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











