Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
శృంగార సమయంలో తలనొప్పా?..ప్రాణానికే ముప్పు!
నాకు తలనొప్పిగా ఉంది..శృంగారానికి దూరంగా ఉండటానికి మహిళలు చెప్పే ఒక సాధారణ సాకుగా దీన్ని చాలామంది భావిస్తారు. ఈ విషయంపై లెక్కలేనన్ని జోకులు, మీమ్స్ కూడా పేలుతుంటాయి. కానీ మీరు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నట్లయితే ఒక్క క్షణం ఆగండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం శృంగార సమయంలో వచ్చే తలనొప్పి అస్సలు జోక్ కాదు, అది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
ప్రముఖ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్ జోస్ బిల్లర్ ఈ విషయంపై మాట్లాడుతూ..లైంగిక కార్యకలాపాల సమయంలో తలనొప్పి రావడం అనేది చాలా సాధారణం. కానీ సిగ్గు, సంకోచం కారణంగా చాలామంది ఈ విషయాన్ని డాక్టర్స్ తో చర్చించడానికి వెనుకాడతారు. ఈ తలనొప్పులు తేలికపాటివిగా మొదలై, కొన్నిసార్లు భరించలేని స్థాయికి చేరతాయి. ఇవి బాధితులకు, వారి భాగస్వాములకు తీవ్రమైన ఆందోళనను, నిరాశను కలిగిస్తాయి అని హెచ్చరించారు.

సాధారణ సమస్యేనా, అంతకంటే ఎక్కువా?
ప్రొఫెసర్ బిల్లర్ ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 1శాతం మంది లైంగిక చర్య సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. చాలా సందర్భాలలో ఇవి మైగ్రేన్ లేదా టెన్షన్ తలనొప్పుల మాదిరి ప్రమాదకరం కానప్పటికీ కొన్ని అరుదైన సందర్భాలలో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తలనొప్పుల వెనుక మెదడులో రక్తస్రావం,స్ట్రోక్, లేదా సబ్‌డ్యూరల్ హెమటోమా వంటి తీవ్రమైన కారణాలు ఉండవచ్చు. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి నరాల సంబంధిత పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం అని ప్రొఫెసర్ బిల్లర్ గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.
శృంగార సంబంధిత తలనొప్పులు - మూడు రకాలు
అంతర్జాతీయ తలనొప్పి సొసైటీ (International Headache Society) ఈ తలనొప్పులను మూడు ప్రధాన రకాలుగా వర్గీకరించింది. అవేంటో ఇక్కడ చూడండి.
ఉద్రేకం ముందు నొప్పి: శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఉద్రేకం పెరిగేకొద్దీ తల, మెడ భాగాల్లో నెమ్మదిగా నొప్పి మొదలవుతుంది. భావప్రాప్తి సమీపించే కొద్దీ ఇది మరింత తీవ్రమవుతుంది.
భావప్రాప్తి సమయంలో నొప్పి: ఇది చాలా తీవ్రమైనది. భావప్రాప్తి సమయంలో పిడుగులాంటి నొప్పి అకస్మాత్తుగా తల వెనుక భాగంలో మొదలవుతుంది. ఈ నొప్పి కొన్ని గంటల పాటు కొనసాగవచ్చు. ఇది చాలా భయానకమైన అనుభూతిని కలిగిస్తుంది.
శృంగారం తర్వాత నొప్పి: ఇది లైంగిక చర్య పూర్తయిన తర్వాత వస్తుంది. ఈ నొప్పి తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు. ఆశ్చర్యకరంగా నిలబడి ఉన్నప్పుడు ఈ నొప్పి ఎక్కువగా ఉండి, పడుకున్నప్పుడు తగ్గుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం? పరిష్కార మార్గాలు ఏమిటి?
ఈ రకమైన తలనొప్పులు మహిళల కంటే పురుషులలో 3 నుండి 4 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తలనొప్పి రకాన్ని బట్టి వైద్యులు మందులను సూచిస్తారు. దాంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సరైన బరువును పాటించడం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లను పూర్తిగా మానేయడం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి ఈసారి శృంగార సమయంలో తలనొప్పి వస్తే సిగ్గుపడకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications