Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
పొద్దున్నే నిద్ర లేవగానే సిగరెట్ తాగితే ఏమవుతుందో తెలుసా!
పొద్దున్నే నిద్రలేవగానే చాలామందికి కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటుంది. మరికొందరికి కళ్లు తెరవగానే సిగగరెట్ తాగి తీ3రాల్సిందే. పొద్దున్నే వెలిగించే సిగరెట్టే వారి రోజును ప్రారంభిస్తుంది. మీరు కూడా ఈ కోవకు చెందినవారైతే మీరు వెంటనే ఈ అలవాటు మానుకోకుంటే పెద్ద ఇబ్బందిని కొని తెచ్చుకున్నట్లే. మీరు రోజులో తాగే సిగరెట్లలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది, మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు ఉదయం పూట తాగే ఆ మొదటి సిగరెట్టే. మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారనే దానితో సంబంధం లేకుండా ఈ ఒక్క అలవాటు మీ ఊపిరితిత్తులను, గుండెను తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఉదయం స్మోకింగ్ ఎందుకంత డేంజర్?
నైట్ విశ్రాంతి తీసుకున్న మన శరీరం పొద్దున్నే ఒక రీసెట్ మోడ్ లో ఉంటుంది. అంటే మన అవయవాలన్నీ ఫ్రెష్ గా, శుభ్రపడి, అత్యంత సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు రాత్రంతా తమను తాము శుభ్రపరుచుకుని, స్వచ్ఛంగా ఉంటాయి. వాటిని రక్షించే శ్లేష్మపొర కూడా ఈ సమయంలో పలుచబడి ఉంటుంది. ఇలాంటి సున్నితమైన సమయంలో మీరు సిగరెట్ వెలిగించినప్పుడు, ఆ పొగలోని వందలాది విష రసాయనాలు నేరుగా ఊపిరితిత్తుల వాల్స్ ని తాకి, తీవ్రమైన వాపును, నష్టాన్ని కలిగిస్తాయి. ఇది రక్షణ కవచం లేనప్పుడు శత్రువుపై దాడి చేయడం లాంటిది.

లోతైన శ్వాసతో రెట్టింపు ప్రమాదం
రాత్రంతా శరీరానికి నికోటిన్ అందకపోవడం వల్ల పొద్దున్నే లేవగానే సిగరెట్ తాగాలనే కోరిక తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా నిద్రలేచిన అరగంట లోపు సిగరెట్ తాగేవారు తెలియకుండానే పొగను చాలా లోతుగా, బలంగా పీల్చుకుంటారు. దీంతో నికోటిన్, టార్ వంటి ప్రాణాంతక రసాయనాలు స్పాంజి నీటిని పీల్చుకున్నట్లుగా రక్తంలో అత్యంత వేగంగా కలిసిపోతాయి. ఇది మీ శరీరంలో క్యాన్సర్ కారకాల స్థాయిని అమాంతం పెంచుతుంది.
గుండె, ఊపిరితిత్తులపై తక్షణ దాడి
ఉదయం పూట తాగే సిగరెట్ కేవలం దీర్ఘకాలిక నష్టాన్నే కాకుండా తక్షణ ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఆ విషపదార్థాలు రక్తంలో కలవగానే గుండె వేగం, రక్తపోటు, ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇది నిశ్శబ్దంగా ఉన్న మీ శరీరాన్ని హఠాత్తుగా షాక్ కు గురిచేయడం లాంటిది. రక్తనాళాలు కుంచించుకుపోయి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఇది రోజంతా మీ శరీరాన్ని అసమతుల్యతకు గురిచేస్తుంది. పరిశోధనల ప్రకారం ఉదయాన్నే ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతరుల కన్నా చాలా రెట్లు అధికం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
