Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ప్లేట్‌లెట్స్ తక్కువ ఉన్నాయా? ఈ పండుతో వేగంగా పెంచుకోవచ్చు!..కివీ కాదు
బ్లడ్ లో ప్లేట్ లెట్లు(రక్త ఫలకాలు)తగ్గిపోయాయి అని డాక్టర్ లు చెబితే మనం తెగ టెన్షన్ పడిపోతుంటాం. రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావాన్ని అరికట్టడానికి, గాయాలు త్వరగా మానడానికి ఇవి సైనికుల్లా పనిచేస్తాయి. ప్లేట్ లెట్ల కౌంట్ తక్కువ ఉంటే చిన్న గాయమైనా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం బారిన పడినప్పుడు ప్లేట్ లెట్లు హఠాత్తుగా పడిపోవడం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ట్రీట్మెంట్ తో పాటు సరైన ఆహారం తీసుకోవడం సంజీవనిలా పనిచేస్తుంది.
ప్లేట్ లెట్ల కౌంట్ పెంచే ప్రస్తావన రాగానే మన బ్రెయిన్ లో వెంటనే గుర్తుకొచ్చేది కివీ ఫ్రూట్. కివీ తింటే రక్తంలో ఫ్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది అని చాలామంది నమ్మతారు..వాస్తవానికి ఇది నిజం కూడా. అయితే బొప్పాయి కూడా రక్తంలో ప్లేట్ లెట్ల కౌంట్ పెంచడంలో సాయపడుతుంది. అయితే ప్లేట్ లెట్ల కౌంట్ పెంచడంలో ఈ రెండింటిలో ఏది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది?

పోషకాల పోటీలో నువ్వా-నేనా
పోషకాల విషయంలో బొప్పాయి,కివీ రెండు పండ్లు ఒకదానికొకటి గట్టి పోటీనిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, రక్తనాళాలను బలంగా ఉంచే విటమిన్ సి కివీలో కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. బొప్పాయిలో కూడా ఇది పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలు, ప్లేట్ లెట్ల ఉత్పత్తికి కీలకమైన ఫోలేట్ కూడా ఈ రెండింటిలోనూ సమృద్ధిగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల విషయానికొస్తే.. కివీలోని పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్ ప్లేట్ లెట్లను నాశనం కాకుండా కాపాడితే..బొప్పాయిలోని బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు శరీరం ఇన్ఫెక్షన్ల నుండి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.
బొప్పాయి ప్రత్యేకత, పైచేయి
డెంగ్యూ సమయంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడంలో బొప్పాయి ఆకుల రసం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం పండుకే పరిమితం కాని అదనపు ప్రయోజనం. మరోవైపు జీర్ణక్రియను మెరుగుపరిచే విషయంలోనూ ఈ రెండూ ముందుంటాయి. బొప్పాయిలోని పపైన్, కివీలోని ఆక్టినిడిన్ అనే ఎంజైమ్స్ మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. ఇది పరోక్షంగా ప్లేట్ లెట్ల ఉత్పత్తికి దోహదపడుతుంది. జ్వరం సమయంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా బొప్పాయిలోని అధిక నీటిశాతం కాపాడుతుంది.
ఏది తినాలి
నిస్సందేహంగా కివీ, బొప్పాయి రెండూ అద్భుతమైన పోషకాల గనులే. రెండూ ప్లేట్ లెట్ల ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే ఈ పోరాటంలో బొప్పాయిదే స్వల్పంగా పైచేయి అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి.
-బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్లను వేగంగా పెంచడంలో ప్రత్యేకంగా నిరూపించబడింది.
-కివీతో పోలిస్తే బొప్పాయి మనకు చాలా సులభంగా, ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.
-ఇది అందరికీ అందుబాటు ధరలో లభించే ఆరోగ్యకరమైన ఫలం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
