Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.!
వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా కేవలం జలుబు, అలర్జీలే కాకుండా.. శరీరంలో కీళ్లు, మోకాళ్ల నొప్పులను కూడా ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో ఎక్కువగా వృద్ధులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు.. మోకాళ్ల నొప్పి, బిగువు, వాపునకు ఎక్కువగా గురవుతుంటారు. ఇందుకు పలు కారణాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది.. నివారణ మార్గాలేంటి.? ఇక్కడ తెలుసుకుందాం..

వర్షాకాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. గాలిలో తేమ పెరిగిన కారణంగా కీళ్ల చుట్టూ ఉండే కండరాలు, స్నాయువులు బిగుసుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీళ్లవాతం ఉన్నవారికి, వాతావరణ మార్పులు.. నొప్పిని, బిగుసుకుపోవడాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నవారు.. ఇంట్లోనే ఉండి పలు జాగ్రత్తలు పాటిస్తున్న వారూ ఉన్నారు. మరి కాలంలో వృద్ధులు, ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..
శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి..
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ముఖ్యం. మోకాళ్లను వెచ్చని బట్టలతో లేదా మోకాలి తొడుగులతో కప్పి ఉంచడం ద్వారా కీళ్లలో బిగుతును తగ్గిస్తుంది. అవసరమైతే మోకాళ్లు, కీళ్ల వద్ద తేలికపాటిగా వెచ్చని కాపడం పెట్టుకోవడం కూడా మేలు చేస్తుంది.
తేలికపాటి వ్యాయామం..
మోకాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం కూడా సరైంది కాదని నిపుణులు అంటున్నారు. తేలికపాటి నడక చేయడం, స్ట్రెచింగ్ చేయడం, డాక్టర్ సలహా మేరకు వ్యాయామాలు చేయడం ద్వారా కొంతవరకు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ 30 నిమిషాల పాటు నడక అలవాటు చేసుకోవడం శ్రేయస్కరం. మోకాళ్ల నుంచి పాదాల వరకు తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి.

బరువు నియంత్రణ
వృద్ధులు, ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మీరు ఎక్కువగా బరువు ఉంటే అది మోకాళ్లపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఫలితంగా నొప్పి ఏర్పడుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది.
కాల్షియం, విటమిన్ డి
ఎముకల బలానికి కాల్షియం, విటమిన్ డి చాలా కీలకం. ఇందుకోసం పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు సరైన మోతాదులో తీసుకోవాలి. రోజులో ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున మీ శరీరానికి విటమిన్ డి తగిలేలా చూసుకోవాలి.
మీ శరీరంలో మోకాళ్ల నొప్పులు దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉన్నా, వాపు పెరిగినా, నడవడం కష్టంగా మారినా.. ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. ఎప్పుడూ సొంతంగా మందులు వాడకూడదు. వాతావరణ మార్పుల కారణంగా మీరు నొప్పి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే పైన చెప్పిన వైద్య నిపుణుల సలహాలు పాటిస్తూ ఉపశమనం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
