Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఈ లక్షణాలతో గుండెపోటును ముందే పసిగడదామా..?
కరోనా వైరస్ శకం తరువాత చాలా మందికి గుండెపోటు వస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా స్కూల్ పిల్లలకు కూడా ఈ గుండెపోటు ప్రమాదం ప్రస్తుతం పొంచి ఉంది. హార్ట్ అటాక్ కన్నా ముందే లక్షణాలను గుర్తించవచ్చని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని రోజుల ముందు నుంచే హార్ట్ అటాక్ లక్షణాలను తెలిస్తే ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రాణాంతకంగా ఉంటే తొందరగా బయటపడతాము.
లక్షణాలను గుర్తిద్దాం
వైద్య సిబ్బంది నిర్వహించిన అధికారిక సర్వే ప్రకారం, మొత్తం 45 శాతం మంది గుండెపోటుకు సంబంధించిన ఛెస్ట్ పెయిన్, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలతో ఉంటారు. గుండెపోటుకు ఒక సంవత్సరం ముందునుంచే ఛాతినొప్పి వస్తుంది. 4 నుంచి 6 రోజుల ముందు నుంచి కళ్లు తిరగడం, ఛాతినొప్పి, నీరసం లాంటి లక్షణాలు విపరితంగా ఉంటాయి.

వ్యత్యాసం
అయితే గుండెపోటుకు ముందు వచ్చే లక్షణాలు పురుషులకు, మహిళలకు వేరువేరుగా ఉంటాయి. మహిళలకు కళ్లుతిరగడం, విరోచనాలు, వెన్నునొప్పి లాంటి లక్షణాలు ఉండగా.. పురుషులకు ఛాతి నొప్పి ఉంటుంది. మహిళల్లో ఈ ఛాతినొప్పి తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతన్నాయ్.
గుండెనొప్పి లక్షణాలను ముందే గుర్తించడం ద్వారా సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా మందికి మానిసకి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. వత్తిడి, డిప్రెషన్ లాంటివి విపరీతంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
విలువైన సమాచారం
ఈ ఆర్టికల్‌లో ఇచ్చింది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు. అత్యంత ప్రాణాంతకమైన హార్ట్ అటాక్ ముందు వచ్చే లక్షణాల గురించి, ముందే జాగ్రత్త పడితే ఎందరో ప్రాణాలు కాపాడబడతాయ్.
గుండె సంబంధిత వ్యాధులు వంశపారంపర్యంగా కూడా వస్తుంటాయ్. ఛాతినొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే.. మీ కుటుంబంలో ఎన్నో ఏళ్ల నుంచి గుండె నబ్బందిత వ్యాధితో బాధపడ్డవారు ఉండిఉంటారు. మీ కుటుంబంలో అలా ఎవ్వరూ లేకున్నా ముందుచర్యగా పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకువాలి
రక్త పరీక్ష
ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష ద్వారా కూడా గుండెపోటు సంభవిస్తుందాలేదా అని తెలుసుకోవచ్చు. రక్త పరీక్ష ద్వారా కూడా గుండెపోటు గురించి తెలుసుకోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెకు సంబంధించిన ట్రొపొనిన్ కణాలు రక్తంలో కలిసిపోతాయ్. ఈ ట్రొపొనిన్ కణాలను రక్త పరీక్షలు గుర్తిస్తారు. అలా గుండెపోటుకు గురవుతున్నట్లు తెలుసుకుంటారు. ఇది తెలుసుకోవడానికి ట్రోపోనిన్ రక్తపరీక్ష చేయించుకోవాల్సిందే.
ఎక్స్‌రే ద్వారా
ఛాతికి ఎక్సరే పరీక్ష చేసి కూడా గుండెపోటు గురించి తెలుసుకోవచ్చు. గుండె ఎలా పనిచేస్తుందనే విషయాలను ఎక్స్‌రే ద్వారానే వైద్యులు పసిగట్టేయగలుగుతారు. స్ట్రెస్ టెస్ట్ అని మరో టెస్ట్‌ను కూడా నిర్వహించి గుండె ఎంత వత్తిడికి గురైందో తెలుసుకొని హార్ట్ అటాక్‌కు సంబంధించిన విషయాలను కనుగ్గొంటారు.
శకం మార్పు
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తరువాత చాలా మందికి గుండెపోటు వచ్చింది. వ్యాక్సిన్ పడని వారికే అలా అయిందనే సమాచారం బాగా వ్యాపించింది. కేవలం వయసు మీదపడిన వారికే గుండెపోటు వస్తుందనే రోజులు పోయాయ్. ఇప్పుడు గుండెపోటు ఎవ్వరికైనా రావచ్చు. గుండెపోటు వస్తుందా లేదా అనే పరీక్షలు చేయించుకోవడం కన్నా రాకుండా చేసుకోవడం ఉత్తమం. రోజు కొంత వ్యాయామం, ఆరోగ్యవంతమైన పోష్టికాహారం, బయట చిరుతిళ్లను తగ్గించడం లాంటివి తగ్గించుకోవాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications