Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Amla Benefits: రోజూ ఉసిరి తింటే బోలెడు లాభాలు.. ఇక ఆరోగ్యం మీ చేతుల్లోనే..!!
Amla Health Benefits: ఉసిరిని చాలా ఆరోగ్యసమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటారు. భారతదేశంలో పూర్వీకుల నుంచి దీనిని ప్రజలు విరివిగా ఆహారంలో భాగం చేస్తూ వచ్చారు. ఆయుర్వేదంలో సైతం ఉసిరికి మంచి ప్రాధాన్యత ఇవ్వబడింది. అయితే నేటి కాలం ప్రజలకు దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ తెలుసు. ఈ క్రమంలో ఉసిరి వల్ల ఉండే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
ముందుగా ఉసిరిలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతాయి. ప్రధానంగా విటమిన్-సి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీరాన్ని అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి కాపాడటంలో దోహదపడుతుంది. ఇదే క్రమంలో ఉసిరిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.

ఇదే క్రమంలో ఉసిరి మానవశరీరంలో జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించటంతో పాటు గట్ హెల్త్ మెరుగుపరచటంలో దోహదపడుతుంది. ఇదే క్రమంలో చర్మ సౌందర్యంపై ఎక్కువగ శ్రద్ధపెట్టే వ్యక్తులకు ఉసిరి పెద్ద వరం అని చెప్పుకోవచ్చు. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి, మెుటిమలు తగ్గించటానికి సహాయపడుతుంది. ఉసిరితో ఉన్న మరో పెద్ద లాభం జుట్టు పెరుగుదలకు సహాయపడటమే. ఇందులోని పోషకాలు కుదుళ్లను బలోపేతం చేయటంతో పాటు త్వరగా తెల్లజుట్టు రాకుండా కూడా సహాయపడుతుంది.
ఉసరి షుగర్ స్థాయిలను రక్తంలో నియంత్రించటానికి సైతం ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక ఉసరి రోజూ తీసుకోవటం గుండెకు సైతం మేలు చేస్తుందని వెల్లడైంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడి ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పైగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కూడా. బరువు తగ్గటంలో సైతం ఇది దోహదపడుతుంది.
ఉసిరి శరీరంలో కాలేయ పనితీరును మెరుగుపరచటంతో పాటు డీఆక్సిఫికేషన్ ప్రక్రియకు సహాయపడుతుంది. అలాగే ఇందులో అధిక స్థాయిలో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి సమస్యలను తగ్గించటంలో దోహదపడుతుంది. పైగా ఇది ఒక అడాప్టోజెన్‌గా పనిచేసి శరీరంలో ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications