Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బీర్ తాగేముందు తెలుసుకోవాల్సిన 6 విషయాలు.. పురుషులు రోజుకు ఎన్ని బీర్లు తాగాలో తెలుసా?
చాలా మంది ఆల్కహాల్ తాగుతుంటారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో చాలా మంది బీర్లు ఎక్కువగా తాగుతుంటారు. అలాంటి వ్యక్తులు బీర్ తాగడం మంచిదా కాదా? తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఏ విధమైన రోగాలు వస్తాయి అనేది రీసెర్చ్ చేస్తుంటారు. అయితే బీర్ తాగడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ అన్నే రకాల దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే రోజుకు ఎన్ని బీర్లు తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి? మగవారు ఎన్ని బీర్లు తాగాలి? మహిళలు ఎన్ని బీర్లు తాగాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బీర్ తాగడం వల్ల ప్రయోజనాలు
బీర్లు పరిమితిలో తాగితే గుండెకు చాలా మంచిదని చెబుతుంటారు. అలాగే ఎముకల సాంద్రత కూడా పెరుగుతుందని, మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతాయని చెబుతుంటారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బీర్లు తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయని తేలింది.

అలాగే ఇందులో పాలి ఫెనల్స్, విటమిన్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇవి మన శరీరంలోని లిపిడ్ ప్రొఫైల్‌తో కలిసి గుండె సమస్యలు రాకుండా దోహదపడతాయి. అలాగే మితంగా బీర్లు తాగడం వల్ల.. మన శరీరానికి యాంటీ యాక్సిడెంట్లు, యాన్తి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వచ్చి చేరతాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేయడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, గుండె సంబంధిత జబ్బులు రాకుండా రక్షిస్తుంది.
బీర్ తాగడం వల్ల దుష్ప్రయోజనాలు
అయితే బీర్లు తాగడం వల్ల ఎంతమొత్తంలో ప్రయోజనాలు ఉన్నాయో, అంత కంటే ఎక్కువ మొత్తంలో దుష్ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. అధికంగా బీర్లు తాగేవారి కాలేయం దెబ్బతింటుంది. అలాగే విపరీతమైన బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీని కారణంగా చెడు కొవ్వు పెరిగిపోయి గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ఛాన్సుంటుంది. అలాగే బీర్ తాగడం వ్యసనంగా మారిపోయి ప్రతిరోజూ తాగకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే బీరును ఒక ఔషధంగా భావించి ప్రతిరోజూ ఒక గ్లాస్ బీర్ తాగితే మాత్రం ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.
బీరును మితిమీరి అధికంగా తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడతారు. అలాగే మూత్ర విసర్జనకు అధికంగా వెళ్లాల్సి వస్తుంది. తద్వారా శరీరంలోని నీటి శాతం మొత్తం తగ్గిపోయి.. నోరు ఎండిపోతుంటుంది. అధికంగా బీరు తాగడం వల్ల క్యాలరీ కంటెంట్ పెరిగిపోతుంది. దీని వల్ల పొట్ట భాగంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. అలాగే ఆ కొవ్వు గుండెకు ప్రమాదకరంగా మారుతుంది.
ఎలాంటి బీర్ తాగాలి? ఎంత మొత్తంలో తాగాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అయిదు శాతం కంటే తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉన్న బీర్లను మాత్రమే తాగాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మహిళలు ప్రతిరోజూ కేవలం ఒక గ్లాస్ బీర్ మాత్రమే తాగాలి. అదే మగవారు రోజుకు రెండు గ్లాసుల బీర్ తాగొచ్చు. అయితే ఆ బీర్‌లో ఆల్కహాల్ తక్కువగా ఉండడం నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ ఎక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా ప్రమాదకరంగా మారుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications