Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? అయితే ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి! లేకపోతే..
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. వైద్యులు సైతం పలు సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీళ్లు దప్పికను తీర్చడంతో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ కొబ్బరి నీళ్ల గురించి మీకు తెలియని కొన్ని నిజాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:
కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వీరి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామం తరువాత కూడా వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల.. శరీరం తేమగా ఉంచుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం మాత్రమే కాకుండా.. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడతాయి. అలాగే మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.
బరువు తగ్గేందుకు సహాయపడతాయి:
సాధారణంగా కొబ్బరి నీళ్లలో చాలా తక్కువ స్థాయిలో క్యాలరీలు ఉంటాయి. అలాగే జీర్ణక్రియ వేగంగా జరిగేందుకు కావాల్సిన ఎంజైమ్‌లు కూడా ఉంటాయి. దీని కారణంగా కొబ్బరి నీళ్లు తాగే వారు సులువుగా వేగంగా బరువు తగ్గుతారు. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో.. వారు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా మార్పును గమనించవచ్చు.
గుండెకు మంచి చేస్తుంది:
కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ యాసిడ్ హై బీపీ, హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షిస్తుంది. అలాగే రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు దోహదపడుతుంది. తరుచుగా కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా.. గుండెకు సంబంధించిన సమస్యలన్నీ క్రమక్రమంగా దూరం చేసుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
కొబ్బరి నీళ్లలో అనేక పోషక విలువలతో పాటు.. యాంటీ యాక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి తగిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వైరల్ వ్యాధుల బారిన పడకుండా.. మన శరీరాన్ని కావాల్సిన శక్తిని అందిస్తాయి.
మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయి:
చాలా మంది కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి కొబ్బరి నీళ్లు ఒక వరమనే చెప్పుకోవాలి. కొబ్బరి నీళ్లు మూత్రపిండాలు నిర్వీషీకరణ చేస్తాయి. దీని కారణంగా మూత్ర పిండాల్లోని రాళ్లను తొలగించుకునే అవకాశముంటుంది. ఎవరైతే కిడ్నీలో రాళ్లతో అధికంగా ఇబ్బంది పడుతున్నారో, వారు తరచూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరచిన అంశాలన్నీ కచ్చితమని మేము నిర్ధారించలేము. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications