Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Strawberry: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండు తినాల్సిందే
సాధారణంగా మనదేశంలో స్ట్రాబెర్రీలు(strawberrys) ఎక్కువగా పండే కాలం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కడ చూసిన ప్రెష్ స్ట్రాబెర్రీస్ కనిపిస్తున్నాయి. ప్రెష్ స్ట్రాబెర్రీలతో మార్కెట్ లన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయి. ఈ రెడ్ కలర్ ఫ్రూట్ ఎంత అందంగా ఉంటుందో..దాని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కవే ఉన్నాయి. ఈ పండు రుచికరమైన కేకులు,ఐస్ క్రీం, అనేక ఇతర డెజర్ట్ లను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు.
స్ట్రాబెర్రీలతో చేసే వెరైటీ ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అయితే స్ట్రాబెర్రీలను వంటకాలుగా కాకుండా కేవలం పండుగా మాత్రమే తింటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కేవలం పండుగా మాత్రమే తింటే చాలా బెటర్. చలికాలంలో ఎక్కువగా దొరికే స్ట్రాబెర్రీలను అసలు ఎందుకు తినాలో ఇక్కడ చూడండి.

స్ట్రాబెర్రీ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
-స్ట్రాబెర్రీ పండు సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలోని వివిధ పదార్థాలు చర్మంపై దద్దుర్లు, అలర్జీలు, అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
-స్ట్రాబెర్రీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం వల్ల మన మెదడు ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టంతో సహా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. ఇది మెదడును అలర్ట్ గా,యాక్టివ్ గా,షార్ప్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
-స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి స్ట్రాబెర్రీలు అకస్మాత్తుగా రక్తంలో చక్కెర పెరుగుదల సమస్యను నివారిస్తాయి.
-విటమిన్ సి పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను తినడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మీరు అంతఈజీగా అనారోగ్యం బారిన పడరు. విటమిన్ సి మన చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. కాబట్టి స్ట్రాబెర్రీలను తినడం వల్ల మీ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలోని విటమిన్ సి కొల్లాజెన్ ప్రొటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని సహాయంతో చర్మం మంచిగా ఉండి నల్ల మచ్చలను తొలగిస్తుంది.
-స్ట్రాబెర్రీలో ఆంథోసైనిన్ అనే పదార్థం ఉంటుంది. దీని సాయంతో మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా గుండెపోటు,పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications