Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఈ వ్యాధులుంటే లైంగిక సుఖాన్ని ఆస్వాదించలేరు.. అవేంటంటే?
శృంగారం అంటే ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఆస్వాదించాలి, అనుభవించాలి. లైంగిక జీవితంలో ఒకరి సమస్య మరొకరిపై ప్రభావం చూపిస్తుంది. లైంగిక జీవితంలో సుఖంగా లేకపోవడం, కోరికలు కలగకపోవడం, శృంగారంలో పాల్గొనడానికి కష్టపడుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని అర్థం చేసుకోవాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యంపై సెక్స్ పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు, హైబీపీ, హార్మోన్ సమస్యలు, కాలేయ మూత్రపిండ సమస్యలు, ఆందోళన, ఒత్తిడి, నిరాశ లాంటి సమస్యలు స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉంటే లైంగిక సుఖాన్ని ఆస్వాదించలేరు.

సెక్సువల్ డిస్‌ఫంక్షన్ రకాలు:
* డిజైర్ డిజార్డర్: సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం
* అరౌజల్ డిజార్డర్: ఉద్రేకం రాకపోవడం
* ఆర్గజమ్ డిజార్డర్: భావప్రాప్తి కలగకపోవడం
* పెయిన్ డిజార్డర్: సంభోగం సమయంలో నొప్పి
లైంగిక బలహీనతు గుర్తించడం ఎలా?
పురుషుల్లో లక్షణాలు:
* అంగస్తంభన సమస్యలు(ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్)
* స్ఖలనం లేకపోవడం లేదా ఆలస్యం కావడం
* అకాల స్ఖలనం
మహిళల్లో లక్షణాలు:
* ఉద్వేగం కలగకపోవడం
* సంభోగం సమయంలో నొప్పి
* యోని పొడిబారడం
* ఫ్రిజిడిటీ- యోని కండరాలు బిగుతుగా మారి సంభోగం చేయలేకపోవండ
సెక్సువల్ డిస్‌ఫంక్షన్‌కు దారితీసే జీవనశైలి వ్యాధులు
1. ఊబకాయం:
అధిక కొవ్వు పేరుకుపోవడం సెక్స్ సమయంలో సౌకర్యంగా కదల్లేక పర్ఫార్మెన్స్ సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ విడుదల తగ్గుతుంది. దీని వల్ల కోరికలు కలగవు, అంగస్తంభన సమస్యలు వస్తాయి, ఉద్వేగానికి లోనుకారు. మహిళల్లో ఊబకాయం వల్ల సెక్స్ కోరికలు తగ్గుతాయి. సంభోగం సమయంలో అసౌకర్యంగా ఉంటుంది.
2. కార్డియోవాస్కులర్ వ్యాధి:
అధిక రక్తపోటు, గుండె జబ్బులు లైంగిక పనితీరును తగ్గిస్తాయి. రక్తసరఫరా సరిగ్గా లేక అంగస్తంభన సమస్యలను తెచ్చిపెడతాయి. స్త్రీలలో జననేంద్రియాలకు రక్త ప్రవాహం తగ్గి యోని పొడిగా మారుతుంది.
3. మధుమేహం:
మధుమేహం రక్తనాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల అంగస్తంభన సమస్యలు వస్తాయి. స్త్రీలలో కోరికలు రావు.
4. మానసిక సమస్యలు:
డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యల వల్ల సెక్స్ పట్ల కోరికలు కలగవు. శృంగార సమయంలో పూర్తి విశ్వాసంతో సెక్స్ ను ఆస్వాదించలేరు.
సెక్సువల్ డిస్‌ఫంక్షన్ ఎలా నివారించాలి:
జీవనశైలి వ్యాధులను ముందుగానే గుర్తించడం ముఖ్యం. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని నివారించాలి. జీవనశైలి వ్యాధులు ఇబ్బంది పెడుతున్నా, లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకున్నా వైద్యులను సంప్రదించడం కీలకం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications