Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
రాత్రి పడుకునేటప్పుడు ఇవి తాగితే..పొట్టు చుట్టూ ఉన్న కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది!
బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. పొద్దున్నే వ్యాయామాలు, ఆహార అలవాట్లలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేస్తుంటారు. కొందరు దీనిని పాటిస్తూ బరువు తగ్గుతారు.అయితే దీన్ని పాటించినా కూడా కొందరు బరువు తగ్గలేకపోతుంటారు. అయితే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ శరీరం కొవ్వును కరిగించే పనిలో ఉండగలదని మీకు తెలుసా? రాత్రి పడుకునే ముందు కొన్ని ప్రత్యేకమైన పానీయాలు తీసుకోవడం ద్వారా మీ జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేయవచ్చు. అలాంటి కొన్ని అద్భుతమైన, నేచురల్ డ్రింక్స ఏవో ఇక్కడ చూడండి.
గోరువెచ్చని నిమ్మకాయ నీరు
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పానీయం మీ జీవక్రియకు ఒక బూస్ట్ ఇస్తుంది. రాత్రిపూట దీనిని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లి కొవ్వు కరిగే ప్రక్రియ చురుకుగా మారుతుంది.

దాల్చిన చెక్క నీరు
ఈ సుగంధభరిత పానీయం కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసి, కొవ్వు నిల్వ ఉండకుండా చూస్తుంది. రాత్రిపూట ఒక కప్పు దాల్చిన చెక్క నీరు తాగితే మీ శరీరం నిద్రలోనూ కేలరీలను ఖర్చు చేస్తుంది.
మెంతి నీరు
బరువు తగ్గించడంలో మెంతి నీరు ఒక రహస్య ఆయుధం. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని పడుకునే ముందు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడి సహజంగానే జీవక్రియ వేగం పుంజుకుంటుంది.
చమోమిలే టీ
ప్రశాంతమైన నిద్ర బరువు తగ్గడానికి చాలా ముఖ్యం. చమోమిలే టీ ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ను తగ్గించి కొవ్వు పేరుకుపోవడాన్ని అరికడుతుంది.
పసుపు పాలు
ఎవరి వంటింట్లో తప్పనిసరిగా పసుపు ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలో మంటను తగ్గించి, జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతూనే బరువును నియంత్రిస్తుంది.
సెలెరీ, కలబంద, అల్లం-నిమ్మ టీ
సెలెరీ వాటర్ ప్రత్యేకంగా పొట్ట కొవ్వును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. కలబంద రసం జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. అల్లం-నిమ్మ హెర్బల్ టీ శరీరాన్ని వెచ్చగా ఉంచి, నిద్రలో కూడా కేలరీలు బర్న్ అయ్యేలా చేస్తుంది. ఈ నేచురల్ డ్రింక్స్ మీ రాత్రి దినచర్యలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడమే కాకుండ, మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
