Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
స్మోకింగ్ చేయనివారికే లంగ్ క్యాన్సర్!..వెలుగులోకి సంచలన విషయాలు
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. ప్రతి ఏటా లక్షల మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారు. క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. అందులో ఒకటి లంగ్ క్యాన్సర్. సాధారణంగా మన చుట్టు పక్కల ఎవరైనా సిగరెట్ లేదా బీడీ తాగుతున్నప్పుడు లంగ్ క్యాన్సర్ వస్తది పోతావ్ రా రేయ్ అని అంటుంటాం. ఎన్ఐహెచ్ రిపోర్ట్ ప్రకారం లంగ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం కూడా స్మోకింగే. 10మంది లంగ్ క్యాన్సర్ పేషెంటల్లో 7గురుకి స్మోకింగ్ వల్లనే అది వస్తుంది. అయితే లేటెస్ట్ గా విడుదలైన ఓ అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి.
అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు
జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ లేదా స్మోక్ చేయని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నట్లు లేటెస్ట్ స్టడీ చెబుతోంది. ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 53-70 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం చేయనివారిలో ఉన్నాయి.

స్మోక్ చేయకున్నా కూడా
ఇప్పటిదాకా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ధూమపానం ప్రధాన కారణమని భావించిన నేపథ్యంలో స్మోకింగ్ చేయనివారిలో కూడా ఇది ఎక్కువగా వస్తుండటం ఆందోళనకర విషయమే. అయితే స్మోక్ చేయకున్నా ఊపిరితిత్తుల లేదా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే..దీనికి ప్రధాన కారణం ఎయిర్ పొల్యూషన్ అని ఆ అధ్యయనం తెలిపింది. కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఎలా కారణమవుతుంది? దాని లక్షణాలు ఏమిటి? ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.
కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుంది?
లంగ్ క్యాన్సర్ లక్షణాల కారణాలను పరిశీలిస్తే.. అనేక అంశాలు దానిలో పాత్ర పోషిస్తాయి. కానీ అతి ముఖ్యమైన కారణం వాయు కాలుష్యం. హానికరమైన సూక్ష్మ కణాలతో కూడిన వాహనాల నుంచి వెలువడే పొగ ఊపిరితిత్తులకు అత్యంత హానికరం. అదేవిధంగా ఫ్యాక్టరీలు,పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య పొగ కూడా గాలిలో కలిసిపోయి పర్యావరణాన్ని విషపూరితం చేస్తుంది. మనం ఈ మైక్రోపార్టికల్స్‌ను పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తుల ఉపరితలాన్ని దెబ్బతీస్తాయి..లోతుగా వెళ్లి ఊపిరితిత్తుల కణజాలంపై ప్రభావం చూపుతాయి.
కొన్ని హానికరమైన రసాయనాలు, రాడాన్ గ్యాస్, బెంజీన్ ఆధారిత రసాయనాలు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ రసాయనాలు గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి,రక్తం ద్వారా శరీరం అంతటా వ్యాపించి ఇతర రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
లంగ్ క్యాన్సర్ లక్షణాలు
ఎక్కువరోజులు దగ్గు ఉండటం
ఆకలి వేయకపోవడం,బరువు తగ్గడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
స్వరంలో మార్పులు
అలసట
ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది
ఎక్కువ కాలం కాలుష్యానికి గురైన వ్యక్తులకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద నగరాల్లో నివసించేవాళ్లు సాధారణంగానే నిరంతరం కాలుష్యానికి గురవుతుంటారు..వీరు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు త్వరగా బలైపోతారు. కెమికల్ ఫ్యాక్టరీలు, కనస్ట్రక్షన్ ఫీల్డ్స్ లో పనిచేసే వ్యక్తులు ప్రమాదకరమైన పదార్థాలు, హానికరమైన వాయువులతో సంబంధం కలిగి ఉంటారు, ఇది వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications