Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తన బ్యూటీ, ఫిట్ నెస్ సీక్రెట్ బయటపెట్టిన మాధురి దీక్షిత్..ఈ వయస్సులో అలా చేస్తున్నందుకేనట!
మాధురి దీక్షిత్..ఈ పేరు భారతీయ సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. 1984లో అబోధ్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధురి దీక్షిత్..తన అందం, అద్భుతమైన నటన, డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ మే 15న తన 58వ పుట్టినరోజు జరుపుకున్న మాధురి దీక్షిత్.. ఇప్పటికీ తరగని అందంతో, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లతో అందంలో,ఫిట్ నెస్ లో పోటీ పడుతున్నారు.
ఈ వయస్సులో కూడా తాను యాక్టివ్ గా, అందంగా ఉండటానికి గల కారణాలను ఆమె ఓ యూట్యూబ్ వీడియోలో తెలిపారు. తక్కువ కేలరీలు, విటమిన్లు అధికంగా ఉండే మొక్కల ఆధారిత పాలను తాసు తీసుకుంటానని ఆమె చెప్పింది. తన మొత్తం ఆరోగ్యం,ఫిట్ నెస్ కారణమైన స్మూతీ రెసిపి గురించి మాధురి దీక్షిత్ తన వీడియోలో చెప్పింది. 2023లో ఆమె పోస్ట్ చేసిన వీడియోలో..ఆరోగ్యమైనవి తినడం,ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు. సాంప్రదాయ పాలకు ఇవి గొప్ప ప్రత్యామ్నాయం అని ఆమె నమ్ముతారు. తాను ఓ రెసిపిని తీసుకుంటానని దానిని గురించి కూడా మాధురి దీక్షిత్ తెలిపారు.

మాధురి దీక్షిత్ చెప్పిన ప్రోటీన్ రిచ్ స్మూతీ తయారీ విధానం
"ఒక మిక్సర్‌లో 2 కప్పుల గడ్డకట్టిన పండ్లు (రాస్‌ప్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లేదా బ్లూబెర్రీస్ వంటివి) వేయండి. దానికి అర కప్పు ఓట్ మిల్క్, బాదం మిల్క్ లేదా మీకు నచ్చిన ఏదేని మొక్కల ఆధారిత పాలను కలపండి. స్మూతీని మరింత ప్రోటీన్‌తో నింపడానికి మీకు సరిపడేంతగా 1 స్కూప్ లేదా అర స్కూప్ ప్రోటీన్ పౌడర్ జోడించండి. పండ్లలోనే సహజమైన తీపి ఉంటుంది కాబట్టి అదనంగా చక్కెర వేయవలసిన అవసరం లేదని మాధురి దీక్షిత్ చెప్పింది.
ఈ స్మూతీని రాత్రే తయారుచేసుకుని మరుసటి రోజు మీతో పాటు ఆఫీస్‌కి లేదా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని..లంచ్ చేసే ముందు ఆకలి వేసినప్పుడు అనారోగ్యకరమైన స్నాక్స్ తినే బదులు ఇది ఒక ఆరోగ్యకరమైన మార్గం అని ఆమె తెలిపారు. మాధురి సూచించిన ఈ స్మూతీ రెసిపీని మన వ్యక్తిగత ఇష్టాలకు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మార్చుకోవచ్చు.
ముఖ్యంగా ఇందులో అదనంగా చక్కెర కలపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఇది మరింత ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్‌ను జోడించడం వల్ల కండరాల పుష్టికి, కడుపు నిండిన భావన కలగడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవడానికి లేదా ఉదయం పూట త్వరితగతిన తయారుచేసుకునే అల్పాహారంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications