ఆవలింతలు వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి.. వెంటనే తెలుసుకొని ఈ పని చేయండి!

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆవలింతలు వస్తుంటాయి. ఇది శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియ. బాగా అలిసిపోయినప్పుడు, నిద్ర సరిగ్గా పట్టనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఆవలింతలు వస్తుంటాయి. అయితే అతిగా ఆవలించడం కూడా ఒక రోగమే అని పలువురు నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆవలించడం అనేది శరీరంలో కొన్ని సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆవలింతల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆవలింతలు ఎలాంటి సమస్యలకు సంకేతం అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.

ఆవలింతలు ఎందుకు వస్తాయి?

మనిషికి సాధారణంగానే ఆవలింతలు వస్తుంటాయి. మెదడులోని ఉష్ణోగ్రతలు క్రమబద్దీకరించినప్పుడు ఈ ఆవలింతలు వస్తుంటాయి. అతిగా పని చేసి అలసిపోయినప్పుడు. లేదా మానసిక ప్రశాంతత లేనప్పుడు, నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఆవలింతలు వస్తుంటాయి. అలాగే ఆవలించి వ్యక్తిని చూసినప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. ఆవలించేటప్పుడు మన చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తరువాత విడిచిపెడతాము.

Major problems and health issues with yawning

ఈ సమయంలో సాధారణంగానే ఒళ్ళు విస్తుంటాము. దీనినే పాండిక్యులేషన్ అని అంటారు. మనుషుల్లో ఆవలించడం అనేది ఒక వైరస్ లాంటిది. ఎందుకంటే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. మనుషులకు మాత్రమే కాకుండా చింపాజీలు, ఇతర జంతువులకు కూడా ఆవలింతలు వస్తాయి.

ఆవలించడం ఎలాంటి సమస్యకు సంకేతం

అతిగా ఆవలించడం అనేది వ్యాధిగా పరిగణించొచ్చు. మీరు అతిగా ఆవలిస్తున్నారంటే మీ శరీరానికి తగిన విశ్రాంతి దొరకడం లేదని అర్ధం చేసుకోవాలి. ఇది స్థిరమైన అలసటకు దారి తీస్తుందట. కొన్ని అధ్యయనాల ప్రకారం అధికంగా ఆవలించడం అనేది గుండె సమస్యకు సంకేతం అని చెప్తున్నారు. ఆవలింతలు అధికంగా వస్తున్నాయంటే గుండె కొట్టుకునే వేగం పెరగడం, హై బీపీ రావడం వంటి సమస్యలకు సంకేతం అని నిపుణులు పేర్కొంటున్నారు.

అతిగా ఆవలించడం వల్ల ఊపిరి తిత్తుల్లోనే కణజాలు సాగిపోయే అవకాశం ఉంది. దీని కారణంగా పలు శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే ఛాన్సుంటుంది. నిద్రలేకపోవడం, అలసట కారణంగా ఆవలింతలు వచ్చేటప్పుడు ఊపిరి ఎక్కువగా బిగపడుతుంటారు. ఈ క్రమంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి, మెడకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విపరీతమైన ఆవలింతలు వల్ల మనసులో అనిశ్చితి, ఆందోళనలు కలుగుతాయి.

గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. మేము ఇది విశ్వసించాలని చెప్పడం లేదు. కేవలం సమాచారం మాత్రమే అందిస్తున్నాం. బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, November 16, 2024, 15:10 [IST]
Desktop Bottom Promotion