Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
52 ఏళ్ల వయస్సులో కూడా నీ యవ్వ తగ్గేదే లే..మలైకా పొద్దున్నే ఏం తాగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బాలీవుడ్ ఫిట్ నెస్ క్వీన్, స్టైల్ ఐకాన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు 50 ఏళ్లు దాటినా ఈ అమ్మడి ఫిట్ నెస్, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తన అందంతో, నాజూకైన శరీరంతో కుర్రకారుకు సైతం మతిపోగొడుతుంది. చాలా మంది ఆమె ఫిట్ నెస్ రహస్యం ఏంటని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఉదయం లేవగానే చాలా మందికి ఓ కప్పు వేడి వేడి టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. శరీరానికి చురుకుదనం రావాలన్నా, నిద్ర మత్తు వదలాలన్నా అదే మందు అని నమ్ముతారు. కానీ మలైకా మాత్రం వీటికి పూర్తి దూరం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా తన డైట్ గురించి మాట్లాడుతూ..నాకు టీ లేదా కాఫీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఉదయాన్నే నాకు అవి అవసరం లేదు అని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచీ పాలు ఇష్టంగా తాగేదాన్నని, కానీ ఇప్పుడు తన శరీరాన్ని తాజాగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నానని చెప్పింది.

మలైకా ఏం తాగుతుంది?
టీ, కాఫీలకు బదులుగా మలైకా తన రోజును నేచురల్ డ్రింక్స్ తో ప్రారంభిస్తుంది. తాను ఎక్కువగా కొబ్బరి నీళ్లు లేదా పెరుగు (లస్సీ/మజ్జిగ) తాగుతానని.. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే స్వచ్ఛమైన నీరు మాత్రమే తన ఎంపిక అని మలైకా చెప్పింది. శరీరాన్ని నేచురల్ గా డీటాక్స్ చేయడానికి, నీటి సమతుల్యతను కాపాడటానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయని ఆమె నమ్మకం.
మలైకా తన అనుభవాన్ని పంచుకుంటూ..ఒకప్పుడు కాఫీ ప్రయత్నించాను, కానీ దాని రుచి నాకు భయంకరంగా అనిపించింది. అంతేకాదు అది తాగిన తర్వాత నా కడుపులో కూడా చాలా అసౌకర్యంగా అనిపించింది. కాఫీ వాసన ఇష్టమే అయినా దాన్ని తాగడం మాత్రం నా వల్ల కాదు అని చెప్పింది.
టీ vs కాఫీ.. నిపుణుల మాట
టీ, కాఫీ రెండూ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే ఉత్తేజపరిచే పానీయాలే. టీలో టానిన్లు అనే పదార్థాలు ఉండగా, కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ మెదడును, శరీరాన్ని చురుకుగా మార్చడంలో సహాయపడతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం ఈ రెండింటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని అతిగా సేవించడం వల్ల నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సమస్యలు వంటి దుష్ప్రభావాలు తప్పవు. మలైకా తన మాటల్లో చెప్పినట్లు, పానీయాల విషయంలో ప్రతి ఒక్కరికీ వారి సొంత ఇష్టాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. మన శరీరానికి ఏది సరిపడుతుందో తెలుసుకుని, దానినే అనుసరించాలి. దేనినీ గుడ్డిగా అనుకరించకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications