24 Hours Sex: 24 గంటలు నాన్‌స్టాప్‌ సెక్స్.. పురుషాంగాన్ని తొలగించిన వైద్యులు

అతి చేయకూడదు.. అతిగా ఏ పనీ చేయకూడదు. దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. తినడంలో అయినా, తాగడంలో అయినా పరిమితి పాటించాలి. అంటే ఓ లిమిట్ వరకే తీసుకోవాలి. లేకపోతే సమస్యలు వస్తాయని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. తాజాగా ఓ వ్యక్తి తన లిమిట్స్ క్రాస్ చేసి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దేని కోసం లిమిట్ దాటాడో..

అదే ఇప్పుడు జీవితాంతం దూరం అయింది. జర్మనీకి చెందిన ఆ వ్యక్తి చేసిన ఘనకార్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతలా ఆ వ్యక్తి ఏం చేశాడు.. ఏ లిమిట్స్ దాటాడు.. తను కోల్పోయింది ఏంటంటే..

Man Penis Amputated After Having 24 Hour Non Stop Sex, What is Septic Shock? Details in Telugu

డ్రగ్స్‌తో 24 గంటల మారథాన్ సెక్స్!:
జర్మనీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి భార్యతో కలిసి వెకేషన్ కోసం ఇటలీకి వెళ్లాడు. ఓ మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇటలీ లాంటి శృంగార నగరంలో అదే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. డ్రగ్స్ తీసుకుని మారథాన్ సెక్స్ చేయాలనుకున్నాడు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకుని మారథాన్ సెక్స్ కు సిద్ధమయ్యాడు. 24 గంటల పాటు తన భార్యతో సెక్స్ చేశాడు. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురియ్యాడు. అతడిని తన భార్య మే 11న విసెరికోర్డియా ఆస్పత్రిలో చేర్చారు.

పురుషాంగాన్ని తొలగించిన వైద్యులు:
దాదాపు వారానికి పైగా ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు ఆ వ్యక్తి. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడం, 24 గంటల పాటు అతిగా సెక్స్ చేయడంతో పరిస్థితి సీరియస్ గా మారి తన పురుషాంగాన్ని వైద్యులు తొలగించారు. సుదీర్ఘంగా శృంగారంలో పాల్గొనడం వల్ల సెప్టిక్ షాక్ రావడంతో మర్మాంగాన్ని దెబ్బతిన్నట్లు అందుకే దాన్ని తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

సెప్టిక్ షాక్ అంటే ఏంటి?
ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సెప్టిక్ అవుతుందని అంటుంటారు. శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రాంతం నుండి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది కాస్త ఇన్ఫెక్షన్ గా మారి సెప్సిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లపై రోగనిరోధక శక్తి సమర్థంగా పోరాడుతుంది. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగనిరోధక శక్తి తీవ్రంగా స్పందించి బ్యాక్టీరియాపై యుద్ధం చేస్తుంది. ఇది శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో ఒక్కోసారి అవయవాలు పని చేయడం మానేస్తాయి. దాన్నే సెప్టిక్ షాక్ అంటారు. దీని వల్ల చివరికి ప్రాణం కూడా పోవచ్చు.

వయాగ్రా ఎలా పని చేస్తుంది?
పురుషాంగం స్తంభించడానికి రక్త ప్రసరణ కీలకం. పురుషాంగంలోకి రక్తం ప్రవహించినప్పుడు అంగస్తంభన కలుగుతుంది. వయాగ్రా తీసుకుంటే రక్తనాళాల్లోని కండర కణాలను సండలించి, రక్త ప్రసరణను పెంచుతుంది. వయాగ్రా అందరిపై ఒకేలాంటి ప్రభావాన్ని చూపించవు. ఆహారం తీసుకుని వయాగ్రా తీసుకున్న వారిలో, మద్యం సేవించే వారిలో వయాగ్రా పనిచేయడానికి సమయం పడుతుంది.

శృంగారంలో పాల్గొనడానికి ఒక గంట ముందు వయాగ్రా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అలాగే రోజులో 50 ఎంజీ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. సాధారణంగా వయాగ్రా 4 గంటల పాటు పని చేస్తుంది. అందుకే సెక్స్ చేయడానికి గంట ముందు తీసుకోవాలంటారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, May 25, 2023, 12:30 [IST]
Desktop Bottom Promotion