Latest Updates
-
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ..
పీరియడ్స్ నొప్పి తీవ్రంగా బాధిస్తోందా? ఈ ఫుడ్స్ తింటే ఉపశమనం లభిస్తుంది
సరైన, సమతుల్య ఆహారం తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. కీళ్ల నొప్పులు, తలనొప్పి లేదా పీరియడ్స్ నొప్పి ఏదైనా కావొచ్చు. కొన్ని ఆహార పదార్థాలు వైద్య పరిస్థితులను తగ్గించడంలో చాలా వరకు సహాయపడతాయి. రుతుస్రావం సమయంలో, అలసట, ఉబ్బరం, మానసిక కల్లోలం, తిమ్మిరి సహా నొప్పిని అనుభవించడం సర్వ సాధారణం. ఇది చికాకు కలిగించే మానసిక స్థితికి దారితీస్తుంది. పనిలో తక్కువ ఉత్పాదకతతో పాటు శరీరంలోని ఇతర అసౌకర్యానికి దారితీస్తుంది. పీరియడ్స్ సమయంలో హెల్తీ అండ్ మైండ్ ఫుల్ డైట్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు.

పీరియడ్స్ నొప్పిని తగ్గించే ఆహారాలు
1. ఆకు కూరలు:
ఆకు కూరలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా లభిస్తాయి. అవి పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి అత్యంత పోషకమైన ఆహారాన్ని తయారు చేస్తాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకలీ, బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండే కొన్ని కూరగాయలు, శరీర శక్తిని అందిస్తాయి. జీవక్రియను పెంచుతాయి. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అలసటను దూరం చేస్తుంది.
2. సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ ఫ్రూట్స్ ఎప్పుడైనా లభిస్తాయి. ఇవి తినడానికి రుచికరంగా ఉండటంతో పాటు పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఆరెంజ్, నిమ్మ వంటి విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే పీరియడ్స్ వేళ వచ్చే నొప్పి, అలసటను దూరం చేస్తాయి. అల్పాహారంతో పాటు మధ్యాహ్న అల్పాహారంగా ఆరెంజ్ ను, నిమ్మకాయలను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
3. పసుపు:
పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు శరీరంలో మంటను తగ్గించడానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. రుతుక్రమం సమయంలో శరీరం బలహీనంగా మారుతుంది. నొప్పిగా ఉంటుంది. పసుపు కలిపిన పాలు లేదీ ఇతర మార్గాల్లో పసుపు తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది.
4. అల్లం టీ:
ఎండాకాలంలో టీ తాగాలనిపించదు. కానీ అల్లం టీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. దాని శోథ నిరోధక లక్షణాలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. నొప్పి లేకుండా పీరియడ్స్ ను పొందేందుకు తాజాగా తురిమిన అల్లంతో ఒక కప్పు టీ తాగండి. పిప్పరమెంట్ టీ, చమోమిలే టీ వంటి ఇతర మూలికా టీలు కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
5. హాట్ డార్క్ చాక్లెట్ డ్రింక్:
ఒక గ్లాసు వేడి చాక్లెట్ డ్రింక్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. డార్క్ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రుతుక్రమం సమయంలో శరీరానికి శక్తినిస్తాయి.
6. జీడిపప్పు, ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి పీరియడ్స్ నొప్పిని తగ్గించగలవు. ఎండుద్రాక్ష రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జీడిపప్పు పెల్విక్ ప్రాంతాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జీడిపప్పులో ఉండే టోకోఫెరోల్ అనే భాగం రుతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications