Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Menstrual Hygiene Day: పీరియడ్స్ గురించి ఇవి కేవలం అపోహలే.. అవేంటంటే?
ప్రతి అమ్మాయి జీవితంలో రుతుక్రమం చాలా సాధారణం. అయితే మన దేశంలో ప్రతి నెలా సహజ సిద్ధంగా జరిగే రుతుక్రమం చుట్టూ ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు, అపోహలు ఉన్నాయి. రుతుక్రమం సమయంలో ఈ నాలుగైదు రోజుల పాటు చాలా పనులకు అమ్మాయిలను దూరంగా ఉంచుతారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. చాలా ఇళ్లలో ఇప్పటికీ వాటిని పాటిస్తున్నారు.
ఈ విశ్వాసాల గురించి పక్కనబెడితే రుతుక్రమం చాలా మందిలో చాలా అపోహలు ఉంటాయి. ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, నొప్పి, బ్లీడింగ్ ఇలా చాలా అంశాల్లో కొందరు తెలిసీ తెలియక ఏవేవో తమకు తామే ఊహించుకుంటూ మదన పడిపోతుంటారు. పీరియడ్స్ చుట్టూ ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి, అవి అపోహలా లేక నిజాలేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1. 28 రోజులకు పీరియడ్స్ రాకపోతే సమస్య ఉన్నట్లే!
పీరియడ్‌కు పీరియడ్‌కు మధ్య పెద్దల్లో 21 రోజుల నుండి 37 రోజుల విరామం ఉంటుంది. ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. యుక్తవయస్సు వారిలో 21 నుండి 45 రోజుల గ్యాప్ ఉంటుంది. ఇది చాలా సాధారణం.
ప్రతి 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ రాకపోయినా 37 రోజుల్లోపు వస్తే అది సాధారణమే అని గుర్తించాలి. గత కొన్ని నెలలుగా పీరియడ్స్ కచ్చితంగా 28 రోజులు వచ్చి, ఒక నెల మాత్రం 35 రోజులకు వచ్చినా మదన పడాల్సిన అవసరం లేదు. ఆహారం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పర్యావరణ కారకాల వల్ల పీరియడ్స్ రావడం ఆలస్యం కావొచ్చు. ఒకవేళ పీరియడ్స్ 37 రోజులు దాటినా రాకపోతే అప్పుడు సమస్యగా పరిగణించి వైద్యుల వద్దకు వెళ్లాలి.
2. పీరియడ్స్ నొప్పి కేవలం కడుపు నొప్పి!
పీరియడ్స్ నొప్పి, కడుపు నొప్పి రెండు చాలా భిన్నంగా ఉంటాయి. కడుపు నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది. కానీ పీరియడ్స్ నొప్పి గర్భంలో అండం తొలగిపోవడం వల్ల వస్తుంది. దీనిని పీరియడ్స్ యొక్క స్పాస్మోడిక్ నొప్పి లేదా డిస్మెనోరియా అంటారు. ఈ పరిస్థితి కడుపు నొప్పికి భిన్నంగా ఉంటుంది. స్త్రీలను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
3. పీరియడ్ బ్లడ్ ఈజ్ డర్టీ బ్లడ్!
పీరియడ్ బ్లడ్ డర్టీ బ్లడ్ కాదు. సాధారణ రక్తం కంటే పీరియడ్స్ వేళ వచ్చే రక్తం కాస్త భిన్నంగా ఉంటుంది. పీరియడ్ బ్లడ్ గాఢత తక్కువగా ఉంటుంది. సాధారణ రక్తం కంటే తక్కువ రక్త కణాలు ఉంటాయి.
4. పీరియడ్ సమయంలో గర్భవతి కాలేరు!
రుతుచక్రం మధ్యలో గర్భవతి అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అండాశయం అండోత్సర్గము అనే ప్రక్రియలో భాగంగా అండాన్ని విడుదల చేసినప్పుడు, పీరియడ్స్ సమయంలో కూడా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా అరుదు. కానీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications