Latest Updates
-
జూన్ 25: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా? -
తుల, ధనుస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - గురువారం, 25 జూన్ 2026 -
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.?
సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారా? జాగ్రత్త! ఈ సమస్యలు తప్పవు
పీరియడ్స్ సమయంలో మహిళలు చికాకుగా, అసౌకర్యంగా ఫీలవుతారు. కానీ కొంతమంది మాత్రం చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అలాంటి వారు సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ వాడేందుకు మొగ్గు చూపుతుంటారు. సాధారణ ప్యాడ్స్ కంటే కూడా సెంటెడ్ ప్యాడ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయని, ఫ్రెష్ ఫీల్ ఇస్తాయని భావిస్తుంటారు. అయితే ఈ సెంటెడ్ శానిటరీ ప్యాడ్‌ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్యులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో ఫీలయ్యే వాసనను కప్పిపుచ్చాల్సిన అవసరం లేదని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

సెంటెడ్ శానిటరీ ప్యాడ్‌ల వల్ల ఉపయోగం లేకపోగా.. వాటి వల్ల పలు సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యోని వద్ద ఉండే సున్నితమైన చర్మానికి చికాకు కలిగిస్తుందని సూచిస్తున్నారు. సెంటెడ్ ప్యాడ్స్ వల్ల తలెత్తే సమస్యలు ఏంటి, అసలెందుకు సెంటెడ్ ప్యాడ్స్ వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సెంటెడ్ ప్యాడ్స్ వల్ల ప్రతికూలతలు:
పీరియడ్స్ సమయంలో అయ్యే బ్లీడింగ్ శానిటరీ ప్యాడ్‌లోని కెమికల్స్ తో కలిస్తే దుర్వాసన వస్తుంది. పీరియడ్స్ వల్ల వస్తుందని భావించే దుర్వాస దీని వల్ల మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. కాబట్టి, పీరియడ్స్ వాసనను నివారించడానికి సెంటెడ్ ప్యాడ్స్ ను వాడటం కంటే కూడా ప్రతి 4 లేదా 6 గంటలకోసారి ప్యాడ్స్ ను మార్చడం మంచి పద్ధతి అని వైద్యులు సూచిస్తున్నారు.
2. ఇన్ఫెక్షన్లకు కారణం కావొచ్చు:
శానిటరీ ప్యాడ్స్ తేమను పీల్చుకుని పొడిగా ఉండే శోషక పదార్థాలతో వాటిని తయారు చేస్తారు. సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల యోని ప్రాంతంలో తేమ ఏర్పడుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పీరియడ్స్ సమయంలో వీలైనంత పొడిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
3. ఆర్టిఫీషియల్ వాసనలు హానికరం:
శానిటరీ నాప్‌కిన్‌లను కెమికల్స్ తో తయారు చేస్తారు. ఇవి బ్లీడింగ్ ను పీల్చుకుని యోని ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి. అయితే సెంటెడ్ ప్యాడ్స్ ఉద్దేశమే వాసన వెదజల్లడం కాబట్టి బ్లీడింగ్ కాగానే ఆ ప్రాంతాన్ని పొడిగా మార్చడం కంటే వాసనలు వెదజల్లే రసాయనాలు విడుదల చేయడమే వీటి ఉద్దేశం. ఈ ఆర్టిఫిషీయల్ కెమికల్ సువాసనలు సున్నితమైన చర్మాన్ని చికాకు పెడతాియి. ఇందులో వాడే హైడ్రోకార్బన్లు క్యాన్సర్ కారకంగా కూడా ఉండొచ్చు.
4. పర్యావరణానికి నష్టం చేస్తాయి, కాలుష్యానికి కారణం అవుతాయి:
శానిటరీ ప్యాడ్స్ కాలుష్య కారకాలు. ఇందులో ఉపయోగించే రసాయన పదార్థాలు సంవత్సరాల తరబడి కూడా భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. సెంటెడ్ ప్యాడ్స్ మరింత హానికరమని నిపుణులు చెబుతున్నారు. మామూలు ప్యాడ్స్ కంటే ఇందులో ఎక్కువ మొత్తంలో కెమికల్స్ వాడతారు. అలా పర్యావరణాన్ని కలుషితం చేస్తారు.
పీరియడ్స్ వాసనను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గాలు:
* రోజూ స్నానం చేయాలి, అవసరమైతే రోజుకు రెండుసార్లు చేయాలి.
* యోని ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి సున్నితమైన సబ్బులు వాడాలి.
* రుతు ప్రవాహం ఎక్కువున్నా, తక్కువున్నా.. ప్రతి 4-6 గంటలకు శానిటరీ ప్యాడ్ లేదా టాంపోన్‌ని మార్చుతూ ఉండాలి.
* యోని అనేది సెల్ఫ్-క్లీనింగ్ ఆర్గాన్. తనను తాను శుభ్రపరచుకోగలదు. కాబట్టి ఇతర అనవసరమైన, హానికరమైన వస్తువులతో శుభ్రం చేయడం మానుకోండి
* బిగుతుగా ఉండే లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, సింథటిక్ లోదుస్తులు వాడొద్దు.
* పీరియడ్స్ వేళ వాసన వస్తుంటే.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా STI గా అనుమానించి వైద్యుల వద్దకు వెళ్లాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications