Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్..ఆరోసారి ఆపరేషన్
క్రికెట్ ప్రపంచంలో సుపరిచితుడైన ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చర్మ క్యాన్సర్ బారిన పడ్డారు. 6వ సారి స్కిన్ క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. ముక్కుపై ఏర్పడిన క్యాన్సర్ కణితిని తొలగించడానికి తాజాగా ఆపరేషన్ చేయించుకున్నట్లు క్లార్క్ తెలిపారు. ఈ విషయాన్ని బుధవారం ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 44 ఏళ్ల క్లార్క్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో..చర్మ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైన సమస్య ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అని తెలిపారు. దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు తెలియజేస్తూ..ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ట్రీట్మెంట్ కన్నా నివారణే ఉత్తమం. క్రమం తప్పకుండా మెడికల్ టెస్టులు చేయించుకోవడం, వ్యాధిని ముందస్తుగా గుర్తించడంలో నా డాక్టర్ నాకు ఎంతగానో సహాయం చేశారు అని క్లార్క్ తన పోస్ట్ లో రాశారు. 2006లో మొదటిసారి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన క్లార్క్.. 2019లో మూడు నాన్-మెలనోమా కణితులతో బాధపడ్డారు. ఈ అనుభవంతో ఆయన క్యాన్సర్ గురించి సోషల్ మీడియాలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు.

చర్మ క్యాన్సర్ అంటే ఏమిటి?
చర్మ కణాలలో అసాధారణ వృద్ధి జరిగినప్పుడు చర్మ క్యాన్సర్ వస్తుంది. సాధారణంగా మన చర్మంలోని పాత కణాలు చనిపోయి కొత్త కణాలు వాటి స్థానంలో ఏర్పడతాయి. కానీ ఈ ప్రక్రియలో ఏదైనా లోపం ఏర్పడి కణాలు అనియంత్రితంగా పెరిగితే అది క్యాన్సర్ కు దారితీస్తుంది. సరైన సమయంలో గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తే చర్మ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
ఏ లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి?
-చర్మంపై అకస్మాత్తుగా మైనపులాంటి తెల్లటి ముద్ద కనిపించి, అది నెమ్మదిగా పెరిగితే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
-చర్మంపై గోధుమ, నలుపు లేదా ఇతర రంగు మచ్చలు అసాధారణంగా కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
-ఒక మచ్చపై తరచుగా దురద లేదా రక్తస్రావం అవుతూ ఉంటే అది ప్రమాదానికి సంకేతం కావచ్చు.
-శరీరంపై ఎక్కడైనా మొటిమలాంటి గడ్డ ఏర్పడితే దాన్ని సాధారణ మొటిమగా భావించకుండా చెక్ చేయించుకోవడం మంచిది.
చర్మ క్యాన్సర్ కు కారణాలు
-ఎక్కువ సమయం ఎండలో తిరగడం లేదా సన్ బర్న్ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
-కొన్ని రకాల రసాయన పదార్థాలతో చర్మం తరచుగా తాకడం కూడా ఒక కారణం.
-కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
-టానింగ్ బెడ్స్, లాంప్స్ ఉపయోగించడం వల్ల చర్మంలోని కణాల DNA దెబ్బతిని క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
నివారణ చర్యలు
-వీలైనంత వరకు తీవ్రమైన ఎండలో తిరగడం మానుకోండి.
-వేసవిలోనే కాకుండా వర్షాకాలం, శీతాకాలంలో కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ వాడండి.
-మార్కెట్లో లభించే క్రీములు, హెయిర్ డైలలో ఉండే రసాయన పదార్థాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే వాడండి.
-చర్మంపై ఏవైనా అనుమానాస్పద మచ్చలు లేదా గడ్డలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం వల్ల పూర్తిస్థాయిలో నయం చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications