Latest Updates
-
ఏ భర్తా భార్యతో అనకూడని ఒకే ఒక మాట.. లేదంటే విడాకులే దారి.! -
కర్లీ హెయిర్‌తో ప్రతి రోజూ ‘చిక్కులు’.. ఈ చవకైన టిప్స్ పాటిస్తే సరి.! -
హైబీపీ ఉన్నవారికి అలర్ట్.. పరగడుపున పెరుగన్నం తింటే ఇన్ని లాభాలా.? -
పాలక్, బీట్రూట్తో పరోటా.. ఆ మధ్యలో పనీర్ స్టఫ్ చేస్తే ఒకటికి రెండు తినాల్సిందే.! -
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు!
నడక మంచిదే కానీ..అలా వాక్ చేస్తే చాలా డేంజర్!
ప్రతిరోజూ కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మన ఇళ్లల్లో పెద్దలు తరచూ చెబుతుంటారు. పాత రోజుల్లో ఎక్కడికైనా నడుచుకుంటూనే వెళ్లేవాళ్లు. క్రమంగా సైకిళ్లు, ఆ తర్వాత మోటర్ బైక్ లు,కార్లు ఇలా అనేక రవాణా సాధనాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో ఒకచోటు నుంచి మరో చోటుకి వెళ్లడం చాలా ఈజీ అయిపోయింది. ఈ క్రమంలో నడక అనే మాట వింటేనే ఇప్పుడు చాలామంది చిరాకు పడిపోతుంటారు. ఇంటి దగ్గర్లోని కిరాణా షాప్ కి కూడా బైక్,కారు వేసుకొని వెళ్తున్నారు చాలామంది.
అయితే నడక వల్ల ప్రయోజనాలు తెలిసినవాళ్లు మాత్రం ప్రతిరోజూ కొంతదూరం నడుస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు. రోజూ 10 వేల అడుగులు నడవడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుందని, కాలేయం, కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలను ఫిట్‌గా ఉంచుతుందని అనేక పరిశోధనల్లో కూడా రుజువైంది.

అయితే నడిచే సమయంలో మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనేక వ్యాధులు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం నడుస్తున్నప్పుడు చేసే తప్పులు..వెన్నునొప్పి,కండరాల తిమ్మిరి,కీళ్ల నొప్పులు,వాపు ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే నడుస్తున్నప్పుడు చేసే పొరపాట్లు ఏంటి..వాటి కారణంగా వచ్చే ప్రమాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
లో బ్యాక్ పెయిన్
నడుస్తున్నప్పుడు మీ భంగిమ సరిగ్గా లేకుంటే అది నడుము నొప్పికి కారణమవుతుంది. ఇది ప్రధాన కండరాలను బలహీనపరుస్తుంది. నడుస్తున్నప్పుడు మీరు మొత్తం బరువును వీపు వైపుకి ఉంచుతుంటే అది వెన్నెముకపై పూర్తి ఒత్తిడిని కలిగిస్తుంది..ఇది వెన్నెముక దిగువ భాగంలో నొప్పిని కలిగిస్తుంది.
పాదాలలో నొప్పి, పొక్కులు
ఎక్కువగా నడిస్తే పాదాల దిగువ భాగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. దీని ఫలితంగా పాదాల మడమలు, యాంకెల్స్ లేదా చీలమండలలో నొప్పి ఉంటుంది. అంతే కాదు ఎక్కువ దూరం నిరంతరం నడవడం వల్ల పాదాల కింది భాగంలో మంట వస్తుంది. దీని వల్ల గాయాలు లేదా పొక్కులు కూడా వస్తాయి.
తొడ నొప్పి
ఎక్కువగా నడవడం వల్ల తొడలో నొప్పి వస్తుంది. అతిగా నడవడం వల్ల దిగువ తొడ లోపలి భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీనిని షిన్ స్ప్లింట్ అంటారు. ముఖ్యంగా ఎక్కువ నడిచే వ్యక్తులతో ఇది జరుగుతుంది.
వాపు
అతిగా నడవడం వల్ల కలిగే నష్టాలలో ఒకటి పాదాలు మరియు చీలమండలలో వాపుకు కారణమవుతుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు, కణజాలాలు క్రిందికి జారడం ప్రారంభిస్తాయి. దాని కారణంగా అవి ఒకే చోట పేరుకుపోయి వాపు ప్రారంభమవుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణులు సలహాలు తీసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications