Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
వర్షాకాలంలో శృంగారం..తెల్లార్లు అంటే కుదరదు..తెరవెనుక పెద్ద కథే..
వర్షాకాలం మొదలైంటే చాలు మట్టివాసన, చిరుజల్లుల సవ్వడి మనసును ఆహ్లాదపరుస్తాయి. ఈ వాతావరణం ప్రేమానురాగాలను, శృంగార భావనలను పెంచుతుంది. భాగస్వామితో గడిపే ఏకాంత క్షణాలు మరింత మధురంగా అనిపిస్తాయి. అయితే ఈ శృంగారభరితమైన కాలంలోనే ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. వర్షాకాలంలో దాంపత్య సుఖాన్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయుర్వేదం కొన్ని ముఖ్యమైన సూత్రాలను నిర్దేశించింది.
శరీరంపై వర్షాకాల ప్రభావం
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో వాత దోషం తీవ్రతరమవుతుంది. వాతావరణంలోని అధిక తేమ మన జీర్ణశక్తిని మందగింపజేస్తుంది. దీనివల్ల శరీరం నీరసించి, బరువుగా అనిపిస్తుంది. కీళ్ల నొప్పులు, గ్యాస్, అలసట వంటి సమస్యలు పెరుగుతాయి. వానాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల సహజంగానే మనలోని ఎనర్జీ, రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడతాయి. ఇది మన శరీరం శక్తిని కూడగట్టుకోవాల్సిన సమయం.

శృంగారంపై ఆయుర్వేద నియమం
శరీరం ఇప్పటికే బలహీనంగా ఉన్న ఈ సమయంలో అధికంగా శృంగారంలో పాల్గొనడం వల్ల శక్తి మరింత క్షీణిస్తుంది. ఇది శరీరాన్ని మరింత బలహీనపరిచి, అనారోగ్యాల బారిన పడేలా చేస్తుంది. అందుకే ఆయుర్వేదం వర్షాకాలంలో శృంగారాన్ని పూర్తిగా నిషేధించదు..కానీ సంయమనం పాటించమని గట్టిగా సూచిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మితంగా శృంగారంలో పాల్గొనడం ఉత్తమం. అతిగా పాల్గొనడం వల్ల వీర్యం బలహీనపడి, వ్యాధులు దాడి చేసే ప్రమాదం పెరుగుతుంది.
పరిశుభ్రతకు పెద్ద పీట
వర్షాకాలంలో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే లైంగిక కలయిక ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో యూటీఐ (UTI), ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కలయికకు ముందు,తర్వాత జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం.
ఆరోగ్యకరమైన దాంపత్యానికి సూచనలు
మానసిక అనుబంధం: శృంగారం కేవలం శారీరక కలయిక కాదు, అది మానసిక, భావోద్వేగ అనుబంధం కూడా. భాగస్వాములిద్దరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడే దాంపత్య సుఖం పరిపూర్ణమవుతుంది.
ఆహారం,విశ్రాంతి: ఈ కాలంలో తేలికగా జీర్ణమయ్యే, వేడిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి, నిద్ర చాలా అవసరం.
పరిశుభ్రత: స్నానం తర్వాత శరీరాన్ని పూర్తిగా తుడుచుకుని, పొడి బట్టలు ధరించాలి. వర్షాకాలపు శృంగారభరిత వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే సంయమనం, పరిశుభ్రత, పరస్పర అవగాహన అనే ఆయుర్వేద సూత్రాలను పాటిస్తే మీ దాంపత్య జీవితం మరింత ఆరోగ్యకరంగా, హ్యాపీగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
