Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గడ్డి పరక అనుకుంటే పొరపాటే.. గరికలో దాగున్న ఆరోగ్య రహస్యాలివే!
హిందూ సంప్రదాయంలో విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజలో గరికకు (దూర్వా) ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. బంగారు ఆభరణాలు, పంచభక్ష్య పరమాన్నాలు సమర్పించకపోయినా భక్తితో గుప్పెడు గరికను సమర్పిస్తే ఆ బొజ్జ గణపయ్య సంతోషిస్తాడని ప్రతీతి.
అయితే ఈ గరిక కేవలం పూజగదికే పరిమితం కాదు.. ఇది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఔషధ గని. మన ఇంటి ఆవరణలో, పార్కులలో సులభంగా కనిపించే ఈ గడ్డి పరకలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

పోషకాల గని గరిక
సాధారణంగా కనిపించే ఈ దూర్వా గడ్డిలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో ఆవశ్యక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక రకాల అనారోగ్యాల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..గరిక కడుపు సంబంధిత వ్యాధుల నుండి మొదలుకొని మానసిక ప్రశాంతత వరకు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది.
రక్తహీనతకు చెక్,రోగనిరోధక శక్తి
ప్రస్తుత కాలంలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాంటి వారికి గరిక రసం అమృతంలా పనిచేస్తుంది. దూర్వా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి, రక్తం శుద్ధి అవుతుంది.
అంతేకాకుండా తాజా గరికను శుభ్రం చేసి, మెత్తగా నూరి తీసిన రసం తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది.
మానసిక ప్రశాంతత, రక్తపోటు నియంత్రణ
ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలిలో మనశ్శాంతి కరువైపోతుంది చాలమందికి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చెప్పులు లేకుండా పచ్చని గడ్డిపై (దూర్వా) నడవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
పాదాలకు గడ్డి తగలడం వల్ల నరాలు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది హై బీపీని నియంత్రించడంలోనూ, కంటి చూపును మెరుగుపరచడంలోనూ, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
జీర్ణక్రియ మహిళల ఆరోగ్యం
గరిక రసం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మహిళల్లో తరచుగా వచ్చే నెలసరి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి గరిక రసం దోహదపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
నోటి,చర్మ సమస్యలకు పరిష్కారం
చిగుళ్ల నుండి రక్తం కారడం, పంటి నొప్పులు లేదా నోటి పూత వంటి సమస్యలు వేధిస్తుంటే.. గరిక రసాన్ని తేనె లేదా నెయ్యితో కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయడం లేదా పుక్కిలించడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అలాగే చర్మంపై వచ్చే చిన్నపాటి దద్దుర్లు, దురదలకు కూడా గరిక పేస్ట్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఎలా తీసుకోవాలి?
లేతగా ఉన్న గరికను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసుకోవాలి. దీనిని నేరుగా లేదా డాక్టర్ల సూచన మేరకు తేనెతో కలిపి తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications