Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వందేళ్లు ఆరోగ్యంగా బతకాలంటే..అరటి ఆకు భోజనం వెనుక దాగున్న ఆరోగ్య రహస్యాలు
మన పూర్వీకులు వంద ఏళ్లు బతికానా ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇప్పుడు చిన్న వయస్సు నుంచే బీపీలు, షుగర్ లు వస్తున్నాయి. కానీ మన తాత,ముత్తాతల కాలంలో వారు ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం వారి జీవనశైలి అని చాలామంది నిపుణులు చెబుతుంటారు.
అరటి ఆకుల్లో తింటే ఆరోగ్యంగా ఉంటారు అని మన పెద్దలు అంటుంటారు. మన దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో పెళ్లిళ్లయినా, పండుగలయినా, దేవుడి ప్రసాదమైనా అరటి ఆకులో వడ్డించాల్సిందే. వేడి వేడి అన్నం, నెయ్యి, పప్పు, ఆవకాయ పచ్చడిని ఆకులో వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు.

అయితే అరటి ఆకులో తినడం అనేది కేవలం ఒక సెంటిమెంట్ లేదా ఆచారం మాత్రమే కాదు. మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ పద్ధతి వెనుక గొప్ప ఆరోగ్య రహస్యాలు, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి.
అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
పోషకాల గని
అరటి ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ వంటి విటమిన్లతో పాటు కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మనం వేడి వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డించినప్పుడు ఆ వేడికి ఆకులోని ఈ పోషకాలు కరిగి ఆహారంతో కలుస్తాయి.
దీంతో మనకు తెలియకుండానే మనం అదనపు పోషకాలను పొందుతాం. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.
జీర్ణక్రియకు సంజీవని
ఈ రోజుల్లో చాలామంది అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి అరటి ఆకు భోజనం ఒక చక్కటి పరిష్కారం. అరటి ఆకులో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఆహారం ద్వారా ఇవి కడుపులోకి చేరినప్పుడు జీర్ణవ్యవస్థలోని వైరస్ లను, బ్యాక్టీరియాను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.
షుగర్ కంట్రోల్
అరటి ఆకులో ఉండే కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్, రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసే లక్షణాలు.. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా అరటి ఆకులో తినడం వల్ల డయాబెటిస్ ముప్పును తగ్గించవచ్చని కొన్ని రిపోర్ట్ లు సూచిస్తున్నాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ప్రత్యేకం
అరటి ఆకులో ఉండే విటమిన్ బి, సి, అధిక ఫైబర్ (పీచు పదార్థం) బరువు నిర్వహణకు సహాయపడతాయి. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది, ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి మీరు తక్కువగా తినేలా ప్రోత్సహిస్తుంది.
శ్వాసకోశ వ్యాధుల నివారణ
ఆస్తమా, బ్రోంకైటిస్ (Bronchitis) వంటి శ్వాసకోశ సమస్యలకు ట్రీట్మెంట్ చేయడంలో అరటి ఆకులోని ఔషధ గుణాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో కూడా శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవడానికి అరటి ఆకు వినియోగాన్ని సూచించారు.
ఇవే కాకుండా ప్లాస్టిక్ లేదా స్టీల్ ప్లేట్లను కడగడానికి వాడే రసాయన సబ్బుల అవశేషాలు మన కడుపులోకి వెళ్లే ప్రమాదం అరటి ఆకులో ఉండదు. ఇది అత్యంత పరిశుభ్రమైనది, పర్యావరణానికి మేలు చేసేది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications