Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఉదయం స్నానం vs రాత్రి స్నానం..ఏ టైంలో స్నానం చేయడం మంచిది?
మనందరం రోజూ స్నానం చేస్తుంటాం. కొందరు ఉదయం,సాయంత్రం రెండు పూట్ల చేస్తుంటారు..మరికొందరు రోజులో ఒకపూట మాత్రమే స్నానం చేస్తుంటారు. రెండు మూడురోజులకొకసారి స్నానం చేసేటోళ్లు కూడా కొందరు ఉంటారు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేది మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యం అని నిపుణులు చెబుతుంటారు. అయితే రోజులో ఎప్పుడు స్నాయం చేయడం ఉత్తమం అని మీరెప్పుడైనా ఆలోచించారా?
స్నానం చేయడానికి బెస్ట్ టైం
నిజానికి ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం లేదని, ఎందుకంటే రెండు స్నాన సమయాలు వాటి సొంత ప్రయోజనాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇది మీ లైఫ్ స్టైయిల్,అవసరాలపై ఆధారపడి ఉంటుంది. చల్ల నీటితో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి కండరాలు చల్లబడతాయి, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒత్తిడి,నిద్ర సంబంధిత సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

ఉదయాన్నే స్నానం చేయడం వల్ల.. మానసిక శక్తి లభిస్తుంది. ఉదయం నిద్రను భంగపర్చడానికి,శరీరాన్ని మేల్కొలపడానికి ఇది సహాయపడుతుంది. రాత్రిపూట చెమట,మురికి తొలగించి మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. పొద్దున్నే స్నానం చేయడం వల్ల మీరు బాగా దృష్టి పెట్టడానికి, మీ రోజును బాగా ఫ్లాన్ చేసుకోడానికి సహాయపడుతుందని చెబుతుంటారు. 2022 నాటి ఓ సర్వే ప్రకారం అమెరికాలో 42శాతం మంది తమ రోజుని ఫ్రెష్ గా స్టార్ట్ చేసేందుకు ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడతారు.
రాత్రి స్నానం..ఇది విశ్రాంతి ప్రక్రియ. రోజంతా ఉన్న దుమ్ము,అలసట,చెమటను తొలగించి శరీరానికి విశ్రాంతినిస్తుంది. రోజంతా ప్రశాంతమైన నిద్ర పొందడానికి సహాయపడుతుంది. రోజంతా ఉరుకులు పరుగులు,చెమట పట్టి అలసిపోయిన శరీరం వేడి నీళ్లతో స్నానం చేసినప్పుడు నరాలు విశ్రాంతి పొందుతాయి,మంచి నిద్ర వస్తుంది. ఓ సర్వే ప్రకారం 25శాతం మంది రాత్రిపూట స్నానం చేయడానికి ఇష్టపడతారు.
డాక్టర్ చెబుతుందిదే
స్నానం చేసిన తర్వాత నిద్రపోతున్నప్పుడు చనిపోయిన చర్మ కణాలు మన మంచం మీద పడతాయని..వీటిని సూక్ష్మ క్రిములు తింటాయి,వీటిని సూక్ష్మక్రిములు తింటాయని,వీటి మలం అలెర్జీ,దురద,ఉబ్బసం వంటి సమస్యలను కలిగిస్తుందని,ఇటువంటి పరిస్థితులొ రాత్రి స్నానం మనకు మాత్రమే కాకుండా మన పడకకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ లో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ ప్రకారం భారత సంతతికి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అలోక్ విజ్ తెలిపారు.
ఆయుర్వేదం,సంప్రదాయ నమ్మకాల ప్రకారం
భారత్ లోని పురాతన వైద్య పద్ధతుల ప్రకారం సూర్యోదయం,సూర్యాస్తమయానికి ముందు సమయం స్నానానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. దీని వల్ల శరీరాన్ని శుద్ది చేయడమే కాకుండా మానసికంగా,ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications